వివాహ బంధంతో ఒక్కటైన ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు

వివాహ బంధంతో ఒక్కటైన ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు

ఇంగ్లాండ్ మహిళా జట్టు క్రికెటర్లు కేథరీన్ బ్రంట్, నాట్ స్కివర్ పెళ్లి చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట వారాంతంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇంగ్లాండ్ మాజీ క్రీడాకారిణి ఇసా గుహా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మిమ్ముల్ని చూస్తే గర్వంగా ఉంది. లవ్ యూ’ అంటూ అభినందించింది. ఈ జంటకు క్రికెట్ ఇంగ్లాండ్ శుభాకాంక్షలు తెలియజేసింది. అధికారిక ట్వీట్టర్ ఖాతాలో వారి ఫొటోను షేర్ చేసింది. పెళ్లి చేసుకున్న కేథరీన్ బ్రంట్, నాట్ స్కివర్ లకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది. 

ఇంగ్లాండ్ జట్లు 2017 ప్రపంచ కప్ గెలవడంలో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. అంతేకాదు.. కేథరీన్ బ్రంట్, నాట్ స్కివర్ 2022 వరల్డ్ కప్ జట్టు సభ్యులు. జట్టు వైస్ కెప్టెన్ అయిన స్కివర్ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో దుమ్ములేపారు. 148 పరుగులు చేసి, నాటౌట్ గా నిలిచారు. ఈ మెగా టోర్నీలో స్కివర్ మొత్తం 436 రన్స్ తో మూడో అత్యధిక స్కోరర్ గా నిలిచారు. ఇప్పటి వరకు 7 టెస్టులు, 89 వన్డేలు, 91 టీ20లు ఆడారు. ఇటు సీనియర్ ప్లేయర్ కేథరీన్ బ్రంట్ మొత్తం 14 టెస్టులు, 140 వన్డేలు, 96 టీ20ల్లో ఆడి 316 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

కేథరీన్ బ్రంట్, నాట్ స్కివర్ తరహాలోనే గతంలోనూ పలువురు మహిళా క్రికెటర్లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. దక్షిణాఫ్రికాకు చెందిన మరిజాన్నే కాప్, డేన్ వాన్ నీకెర్క్  ఉంగరాలు మార్చుకున్నారు. ఇటు న్యూజిలాండ్ కు చెందిన ఏమీ సట్టెర్త్ వైట్, ల్యూ తహుహు పెళ్లి చేసుకున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

మాదాపూర్లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ

మోడీజీ మీ 8 ఏళ్ల పాలనకు 8 ప్రశ్నలు..!