
న్యూఢిల్లీ: ఫ్యూచర్కూపన్స్తో తను కుదుర్చుకున్న ఒప్పందాన్ని కాంపిటిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ అమెజాన్ దాఖలు చేసిన పిటీషన్‌ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ట్రిబ్యునల్(ఎన్సీలాట్) తోసిపుచ్చింది. సీసీఐ ఇచ్చిన తీర్పును జడ్జీలు వేణుగోపాల్, కుమార్ మిశ్రాతో కూడిన బెంచ్ సమర్థించింది. సీసీఐ ఆదేశించినట్టుగానే 45 రోజుల్లో రూ.200 కోట్ల జరిమానాను చెల్లించాలని అమెజాన్‌కు స్పష్టం చేసింది. ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌సీపీఎల్)లో అమెజాన్ 49 శాతం వాటా కొనడానికి ఇచ్చిన అనుమతిని కిందటి డిసెంబరులో సీసీఐ నిలిపివేస్తూ రూ.200 కోట్ల జరిమానా కూడా వేసింది.