స్టార్ట్​.. కెమెరా.. యాక్షన్​.. ఎఫ్​టీఐఐ జేఈటీ-2020

స్టార్ట్​.. కెమెరా.. యాక్షన్​..  ఎఫ్​టీఐఐ జేఈటీ-2020

‘నలుగురికి వినోదం పంచుతూ తెరమీద మెరవాలనే కోరిక మీలో ఉందా? నవరసాలు పలికిస్తూ కెమెరాను ఫేస్ చేయాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రముఖ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్స్ జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్ (జెట్) ద్వారా మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. సెలెక్టయితే యాక్టింగ్‌తో పాటు ప్రొడ్యూసింగ్, డైరెక్షన్, ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ వంటి పలు కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పటికే షార్ట్ ఫిల్మ్ చేస్తూ.. మూవీ, టీవీ రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూసే వారు దీనిని అద్భుత అవకాశంగా మలుచుకోవాలనుకుంటే నోటిఫికేషన్ వివరాలు చదివేయండి మరి.

మన దేశంలో ఫిలిం, టెలివిజన్ ‌‌ ట్రైనింగ్ కు అవెన్యూలుగా పేరొందిన సత్యజిత్ ‌‌రే ఫిలిం అండ్ ‌‌  టెలివిజన్ ‌‌ ఇన్ ‌‌స్టిట్యూట్ ‌‌ (ఎస్ ‌‌ఆర్ ‌‌ఎఫ్ ‌‌టీ, కోల్ ‌‌కతా), ఫిలిం అండ్ ‌‌ టెలివిజన్ ‌‌ ఇన్ ‌‌స్టిట్యూట్ ‌‌ ఆఫ్ ‌‌ ఇండియా (ఎఫ్ ‌‌టీఐ, పుణె)  సంయుక్తంగా జాయింట్ ‌‌ ఎంట్రన్స్ ‌‌ టెస్ట్ ‌‌ (జేఈటీ-2020) నోటిఫికేషన్ విడుదల చేశాయి. రిటన్ టెస్ట్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశం కల్పిస్తారు. ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఫిబ్రవరి 15 లేదా 16న పరీక్ష నిర్వహిస్తారు.

ఎస్ ‌‌ఆర్ ‌‌ఎఫ్ ‌‌టీఐ, కోల్కతా

పోస్ట్ ‌‌ గ్రాడ్యుయేట్ ‌‌ ప్రోగ్రామ్ ‌‌ ఇన్ ‌‌ సినిమా సంబంధించి   ఎలక్ట్రానిక్, డిజిటల్ రంగాల్లో  కోర్సులు మూడేళ్ల పాటు  ఉంటాయి .  డైరెక్షన్ ‌‌ అండ్ ‌‌ స్క్రీన్ ‌‌ప్లే రైటింగ్ ‌‌, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ‌‌, ప్రొడ్యూసింగ్ ‌‌ ఫర్ ‌‌ ఫిలిం అండ్ ‌‌ టెలివిజన్ ‌‌, సౌండ్ ‌‌ సినిమారికార్డింగ్ ‌‌ అండ్ ‌‌ డిజైన్ ‌‌, యానిమేషన్ ‌‌  కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  ఇందులో చేరడానికి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. సౌండ్ ‌‌ రికార్డింగ్ ‌‌ అండ్ ‌‌ డిజైన్ ‌‌ కోర్సు ఎంచుకున్నవారు ఇంటర్ ‌‌ స్థాయిలో ఫిజిక్స్ ‌‌ ఒక సబ్జెక్టుగా చదివి వుండాలి. యానిమేషన్ ‌‌ సినిమాను ఎంచుకున్నవారికి డ్రాయింగ్ ‌‌లో నైపుణ్యం ఉండాలి.

పీజీ ప్రోగ్రామ్ ‌‌ ఇన్ ‌‌ ఎలక్ట్రానిక్ ‌‌ అండ్ ‌‌ డిజిటల్ ‌‌ మీడియా సంబంధించి రెండేండ్ల   కోర్సులు  ఉన్నాయి.  రైటింగ్ ‌‌ ఫర్ ‌‌ ఎలక్ట్రానిక్ ‌‌ అండ్ ‌‌ డిజిటల్ ‌‌ మీడియా, ఎలక్ట్రానిక్ ‌‌ అండ్ ‌‌ డిజిటల్ ‌‌ మీడియా మేనేజ్ ‌‌మెంట్ ‌‌, సినిమాటోగ్రఫీ ఫర్ ‌‌ ఎలక్ట్రానిక్ ‌‌ అండ్ ‌‌ డిజిటల్ ‌‌ మీడియా, డైరెక్షన్ ‌‌ అండ్ ‌‌ ప్రొడ్యూసింగ్ ‌‌ ఫర్ ‌‌ ఎలక్ట్రానిక్ ‌‌ అండ్ ‌‌ డిజిటల్ ‌‌ మీడియా, ఎడిటింగ్ ‌‌ ఫర్ ‌‌ ఎలక్ట్రానిక్ ‌‌ అండ్ ‌‌ డిజిటల్ ‌‌ మీడియా, సౌండ్ ‌‌ ఫర్ ‌‌ ఎలక్ట్రానిక్ ‌‌ అండ్ ‌‌ డిజిటల్ ‌‌ మీడియా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  ఇందులో చేరడానికి  డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. సౌండ్ ‌‌ ఫర్ ‌‌ ఎలక్ట్రానిక్ ‌‌ అండ్ ‌‌ డిజిటల్ ‌‌ మీడియా కోర్సు ఎంచుకున్నవారు ఇంటర్ ‌‌ స్థాయిలో ఫిజిక్స్ ‌‌ ఒక సబ్జెక్టుగా చదివుండాలి.

ఎఫ్ ‌‌టీఐ, పుణె

ఎఫ్ ‌‌టీఐలో అందించే కోర్సులన్నీ  పోస్టు గ్రాడ్యుయేట్ ‌‌ సర్టిఫికెట్ ‌‌ ప్రోగ్రామ్ ‌‌లు. ఇందులో   డైరెక్షన్ ‌‌ అండ్ ‌‌ స్క్రీన్ ‌‌ప్లే రైటింగ్ ‌‌, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ‌‌, సౌండ్ ‌‌ రికార్డింగ్ ‌‌ అండ్ ‌‌ డిజైన్ ‌‌ లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి రెండేండ్ల కోర్సులు.  కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.  సౌండ్ ‌‌ రికార్డింగ్ ‌‌ అండ్ ‌‌ డిజైన్ ‌‌ కోర్సును ఎంచుకున్నవారు ఇంటర్ ‌‌ స్థాయిలో ఫిజిక్స్ ‌‌ సబ్జెక్టు తప్పనిసరిగా  చదివుండాలి. ఆర్ట్ ‌‌ డైరెక్షన్ ‌‌ అండ్ ‌‌ ప్రొడక్షన్ ‌‌ డిజైన్ ‌‌ కోర్సుకు అప్లై చేసే వారు  అప్లయిడ్ ‌‌ ఆర్ట్స్ ‌‌, ఆర్కిటెక్చర్ ‌‌, పెయింటింగ్ ‌‌ ఇంటీరియర్ ‌‌ డిజైనింగ్ ‌‌ లేదా సంబంధిత ఫైన్ ‌‌ఆర్ట్స్ ‌‌లో డిగ్రి పూర్తి చేసి ఉండాలి. హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై, ముంబాయి, ఫుణే, ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాలలో  25 ఎగ్జామ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి.

సెలెక్షన్ ప్రాసెస్ ‌‌

ఎలక్ట్రానిక్, డిజిటల్ రంగాల్లో   కోర్సులలో ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది.  ఎంట్రెన్స్ టెస్ట్, ఓరియేంటేషన్ , ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.  ప్రతి దశలో  సాధించిన మార్కుల ఆధారంగా  సీటు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ ఉంటుంది. చివరగా మెడికల్ టెస్ట్ ‌‌ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు. అనంతరం స్టూడెంట్ ‌‌కు ఆసక్తి ఉన్న కోర్సును ఎంపిక చేసుకునే చాన్స్​ఉంది. ఇందులో ఆయా విభాగాలను అనుసరించి  మూడు గ్రూపులుగా విభజించారు.   గ్రూప్ ‌‌-–ఎలో   ప్రొడ్యూసింగ్ ‌‌ ఫర్ ‌‌ ఫిలిం అండ్ ‌‌ టెలివిజన్ ‌‌, యానిమేషన్ ‌‌ సినిమా, ఆర్ట్ ‌‌ డైరెక్షన్ ‌‌ అండ్ ‌‌ ప్రొడక్షన్ ‌‌ డిజైన్ ‌‌, స్క్రీనింగ్ ‌‌ యాక్టింగ్ ‌‌, స్క్రీన్ ‌‌ రైటింగ్ ‌‌ ఉన్నాయి.  గ్రూప్ ‌‌-–బిలో  డైరెక్షన్ ‌‌ అండ్ ‌‌ స్క్రీన్ ‌‌ప్లే రైటింగ్ ‌‌, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ‌‌, సౌండ్ ‌‌ రికార్డింగ్ ‌‌ అండ్ ‌‌ డిజైన్  గ్రూప్ ‌‌-–సిలో  డైరెక్షన్ ‌‌ అండ్ ‌‌ ప్రొడ్యూసింగ్ ‌‌/ డైరెక్షన్ ‌‌, సినిమాటోగ్రఫీ/ ఎలక్ట్రానిక్ ‌‌ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ‌‌/ వీడియో ఎడిటింగ్ ‌‌, సౌండ్ ‌‌ ఫర్ ‌‌ ఎలక్ట్రానిక్ ‌‌ అండ్ ‌‌ డిజిటల్ ‌‌ మీడియా/ సౌండ్ ‌‌ రికార్డింగ్ ‌‌ అండ్ ‌‌ టెలివిజన్ ‌‌ ఇంజినీరింగ్ ‌‌, ఎలక్ట్రానిక్ ‌‌ అండ్ ‌‌ డిజిటల్ ‌‌ మీడియా మేనేజ్ ‌‌మెంట్ ‌‌, రైటింగ్ ‌‌ ఫర్ ‌‌ ఎలక్ట్రానిక్ ‌‌ అండ్ ‌‌ డిజిటల్ ‌‌ మీడియా ఉన్నాయి. వీటికి అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు.

ఎగ్జామ్ ప్యాటర్న్

ఎగ్జామ్ రెండు సెక్షన్లుగా డివైడ్ చేసి ఉంటుంది. సెక్షన్‌–ఏ 30 మార్కులు, సెక్షన్–బి 70 మార్కులు కలిపి మొత్తం 100 మార్కులకు పేపర్ ఉంటుంది. ఇందులో  మల్టీపుల్ ఛాయిస్  డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ టైమ్ 3 గంటలు ఉంటుంది. సినిమా విభాగం, టీవీ విభాగం,  ఫిలిం విభాగాల కోర్సుల వారికి సెక్షన్‌ ఏలో  జనరల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌. జనరల్‌ అవేర్‌నెస్‌, జాతీయం, అంతర్జాతీయం,  భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆర్ట్‌, ఆర్కిటెక్చర్‌, మ్యూజిక్‌, ఫోక్‌ ఆర్ట్‌ మొదలైన వాటి నుంచి ప్రశ్నలుంటాయి. సెక్షన్‌–బిలో  సినిమా సంబంధిత,   డైరెక్షన్‌ అండ్‌ స్క్రీన్‌ప్లే రైటింగ్‌ (ఫిలిం) వారికి స్టోరీ రైటింగ్‌ ఎబిలిటీ,  క్రియేటివ్‌ ఆస్పెక్ట్స్‌ ఆఫ్‌ డైరెక్షన్‌ క్వశ్చన్స్ ఉంటాయి.

స్కిల్స్ నేర్చుకుని రాణించవచ్చు
ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి రావడానికి ఇప్పటి యువత చాలా ఆసక్తి చూపిస్తున్నారు. సినీ, టీవీ రంగాల్లో ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్ అవసరం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి ఇండస్ట్రీలో సెటిల్ కావాలని అనుకునే వారు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లలో ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుంది. నచ్చిన కోర్సులలో చేరి స్కిల్స్ పెంచుకోవచ్చు. ఇప్పుడు సినీ ఫీల్డ్ లో ఉన్న చాలా మంది ఆర్టిస్ట్ లు ట్రైనింగ్ తీసుకుని వచ్చినవారే.. కోల్ కతా, పుణె, బెంగుళూర్ వంటి సిటిలలో జాతీయ స్థాయి ఇనిస్టిట్యూట్ లతో పాటు హైదరాబాద్ లో చాలా ఇనిస్టిట్యూట్ లు అందుబాటులో ఉన్నాయి. మెళకువలు నేర్చుకుని నచ్చిన రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.  – వాణిప్రసాద్, మధు ఫిల్మ్ఇనిస్టిట్యూట్, హైదరాబాద్

నోటిఫికేషన్

ఫిల్మ్ అండ్ టెలివిజ ‌‌న్ ఇన్ ‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్ ‌‌టీటీఐ)- పుణె, స ‌‌త్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజ ‌‌న్ ఇన్ ‌‌స్టిట్యూట్(ఎస్ఆర్ఎఫ్ ‌‌టీఐ)-కోల్ ‌‌క ‌‌తాలో గ్రూప్​‘ఏ’, ‘బీ’, ‘సీ’ కోర్సుల్లో ప్రవేశాల ‌‌కు ఏటా నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ టెస్ట్ ‌‌(జెట్ ‌‌)–2020 ప్రకటన విడుదలైంది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సులు

ప్రొడ్యూసింగ్​, యానిమేషన్ సినిమా, ఆర్ట్​ డిజైన్​ & ప్రొడక్షన్ డిజైన్​, స్క్రీన్​ యాక్టింగ్, స్క్రీన్​ రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్ తదితరాలు

అర్హత ‌‌

ఏదైనా​ డిగ్రీ, సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్​ డిగ్రీ ఉత్తీర్ణత ‌‌

సెలెక్షన్​ ప్రాసెస్​

ప్రవేశ ‌‌ ప ‌‌రీక్ష, షార్ట్ ‌‌లిస్టింగ్ ‌‌, ఇంట ‌‌ర్వ్యూ, మెడిక ‌‌ల్​టెస్ట్​ ద్వారా

ఫీజు

జ ‌‌న ‌‌ర ‌‌ల్/ఓబీసీలకు- రూ.4000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల ‌‌కు- రూ.1250-

చివ ‌‌రితేది

2020 జనవరి 24

ప్రవేశ ప ‌‌రీక్ష

2020 ఫిబ్రవ ‌‌రి 15,16

వెబ్​సైట్​

www.applyadmission.net/jet2020