
ప్రావిడెంట్ ఫండ్ విషయంలో ఉద్యోగులకు భద్రత కల్పించేందుకు EPFO ( ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజషన్ ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రావిడెంట్ ఫండ్ విషయంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఈపీఎఫ్ఓ. పీఎఫ్ అకౌంట్లో డబ్బు డిపాజిట్ అయినప్పుడు మెసేజ్ ద్వారా ఉద్యోగికి అలర్ట్ ఇచ్చే విధానాన్ని రూపొందించింది.
ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులకు తమ పీఎఫ్ అకౌంట్లో పీఎఫ్ డబ్బులు జమ అవుతున్నాయా లేదా అనే విషయం తెలియడం లేదు. వారు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ని అనేక మార్గాల్లో తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు, పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి సులభమైన మార్గం లేదు.. ఈ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసేందుకు ఈపీఎఫ్ఓ ఐటీ, బ్యాంకింగ్ సిస్టంతో కలిసి సన్నాహాలు చేస్తోంది.
Also Read:-దసరా వేళ గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా:
ప్రస్తుతం, పీఎఫ్ బ్యాలెన్స్‌ను 4 విధాలుగా చెక్ చేసుకోవచ్చు:
వెబ్‌సైట్ లో చెక్ చేయటం:
- మీ PF బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునేందుకు EPF పాస్‌బుక్ పోర్టల్ కి లాగిన్ అవ్వండి.
- UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్), పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి.
- లాగిన్ అయిన తర్వాత, డౌన్‌లోడ్ / వ్యూ పాస్‌బుక్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఇలా చేసిన తర్వాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ స్క్రీన్ పై కనపడుతుంది.
UMANG యాప్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోండి:
- UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, EPFOపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు, ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ పై క్లిక్ చేయండి.
- తర్వాత, వ్యూ పాస్‌బుక్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు, మీ UAN, పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేయండి.
- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి వచ్చిన OTPని ఎంటర్ చేసి పీఎఫ్ బ్యాలెన్స్ ను చెక్ చేసుకోవచ్చు.
మిస్డ్ కాల్:
- మిస్డ్ కాల్స్ ద్వారా బ్యాలెన్స్ సమాచారాన్ని పొందడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి.
- కొంత సమయం తర్వాత మొబైల్‌లో పీఎఫ్ అకౌంట్ సమాచారం మెసేజ్ ద్వారా వస్తుంది.
SMS ద్వారా:
- మెసేజ్ ద్వారా PF బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే, EPFOలో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుండి 7738299899కి SMS పంపాలి.
- EPFO UAN LAN (భాష) అని టైప్ చేసి... ఇంగ్లీష్ లో సమాచారం కోసం, LANకి బదులుగా ENG అని టైప్ చేయాలి.
- తెలుగులో సమాచారం కోసం LANకి బదులుగా TEL అని టైప్ చేయాలి.