మార్కెట్​ భారీ పతనం 1,272 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్​

మార్కెట్​ భారీ పతనం 1,272 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్​
  • 368 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • ఇన్వెస్టర్లకు  రూ.3.5 లక్షల కోట్ల లాస్​

ముంబై:  మిడిల్​ఈస్ట్​లో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ సమస్యలు,  జపాన్ మార్కెట్ల బలహీనతకుతోడు బ్యాంకింగ్, ఫైనాన్స్,  ఆటో స్టాక్‌‌‌‌లలో భారీ అమ్మకాల కారణంగా సోమవారం ఈక్విటీ బెంచ్‌‌‌‌మార్క్ సూచీలు సెన్సెక్స్,  నిఫ్టీ దాదాపు 1.5 శాతం పతనమయ్యాయి.  అంతేకాకుండా, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ఇండెక్స్‌ హెవీ వెయిట్‌ స్టాక్స్​లో   అమ్మకాల ఒత్తిడితో విదేశీ పెట్టుబడులు తగ్గాయి. బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్ 1,272.07 పాయింట్లు పడిపోయి 84,299.78 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 1,314.71 పాయింట్లు క్షీణించి 84,257.14 వద్దకు చేరుకుంది. 

ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద రూ.3.5 లక్షల కోట్లు తగ్గింది.  బీఎస్​ఈలో మొత్తం 2,223 స్టాక్‌‌‌‌లు క్షీణించగా, 1,819 షేర్లు లాభపడ్డాయి.  ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ నిఫ్టీ 368.10 పాయింట్లు తగ్గి 25,810.85 వద్దకు చేరుకుంది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాల కారణంగా నిఫ్టీ రెండు నెలల్లో ఎన్నడూ లేనంతగా నష్టపోయిందని  హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసానీ అన్నారు.  30 సెన్సెక్స్ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్,  యాక్సిస్ బ్యాంక్ 3 శాతం పైగా క్షీణించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, బజాజ్ ఫిన్‌‌‌‌సర్వ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  టాటా మోటార్స్ వంటి షేర్లు వెనకబడి ఉన్నాయి. అయితే, జేఎస్‌‌‌‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌‌‌‌టీపీసీ, టాటా స్టీల్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. 

రిలయన్స్​కు భారీ లాస్​

పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల తర్వాత లాభాల బుకింగ్ పెరగడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్‌‌‌‌ దెబ్బతిందని పీఎల్ క్యాపిటల్ ఎనలిస్టులు విక్రమ్​కసత్​ అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా మూడు శాతానికిపైగా నష్టపోయిందని, ఇది కూడా మార్కెట్​ను దెబ్బతీసిందని వివరించారు. బీఎస్‌‌‌‌ఈ మిడ్‌‌‌‌క్యాప్ గేజ్ 0.28 శాతం క్షీణించగా, స్మాల్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం పెరిగింది.  సూచీలలో ఆటో 1.91 శాతం, బ్యాంకెక్స్ 1.82 శాతం, రియల్టీ 1.80 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.40 శాతం, సేవలు 1.22 శాతం, టెలికమ్యూనికేషన్ 1.19 శాతం పతనమయ్యాయి.  

మెటల్,  కమోడిటీస్ లాభపడ్డాయి.    ఆసియా మార్కెట్లలో, జపాన్  బెంచ్‌‌‌‌మార్క్ నిక్కీ 225 ఇండెక్స్ సోమవారం దాదాపు 5 శాతం పడిపోయింది. దాని పాలక లిబరల్ డెమొక్రాట్లు శుక్రవారం మాజీ రక్షణ మంత్రి షిగెరు ఇషిబాను ప్రధాన మంత్రి ఫ్యూమియో కిషిదా వారసుడిగా ఎన్నుకున్నారు.  ఇషిబా ఇంతకు ముందు సున్నా స్థాయి నుంచి వడ్డీ రేట్లను పెంచడానికి బ్యాంక్ ఆఫ్ జపాన్​కు మద్దతు ఇచ్చారు.  

సియోల్ మార్కెట్లు తీవ్ర కోతలతో స్థిరపడ్డాయి. చైనా ప్రభుత్వం బలహీనపడుతున్న ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా ఆస్తి  ఆర్థిక మార్కెట్లను పెంచడానికి తాజా ఉద్దీపనలను ప్రకటించడంతో షాంఘై,  హాంకాంగ్ లాభాల్లో ముగిశాయి.  మిడ్ సెషన్ డీల్స్‌‌‌‌లో యూరోపియన్ మార్కెట్లు కూడా బాగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి.ఎఫ్‌‌‌‌ఐఐలు సోమవారం నికరంగా రూ. 9,791 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.  బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌‌‌కు 71.84 డాలర్లకు చేరుకుంది.