మార్కెట్లోకి ఓఎం ఇమేజింగ్ ప్రొడక్టులు

మార్కెట్లోకి ఓఎం ఇమేజింగ్ ప్రొడక్టులు

హైదరాబాద్​, వెలుగు: ఓఎం సిస్టమ్ ఇండియాలో రెండు కొత్త ఇమేజింగ్ ప్రొడక్టులను విడుదల చేసింది. వైల్డ్‌‌‌‌‌‌‌‌లైఫ్, మాక్రో, పక్షుల ఫొటోగ్రఫీ కోసం రూపొందించిన ఓఎం-5 మార్క్​-2 ఇంటర్‌‌‌‌‌‌‌‌ ఛేంజబుల్ లెన్స్ కెమెరాతోపాటు ఎం.జ్యూయికో డిజిటల్ ఈడీ 50-200ఎమ్ఎమ్ ఎఫ్2.8 ఐఎస్​ ప్రో లెన్స్​ను విడుదల చేసింది.  

పండుగల సీజన్‌‌‌‌‌‌‌‌లో విడుదలైన ఈ ఓఎం-5 మార్క్​-2 ఇంటర్‌‌‌‌‌‌‌‌ఛేంజ్డ్​ లెన్స్ కెమెరాను ఔట్‌‌‌‌‌‌‌‌డోర్ ఫొటోగ్రఫీ ప్రియుల కోసం డిజైన్  ​చేశారు. ఇది తేలికగా ఉంటుంది. ఐపీఎక్స్​53 రేటింగ్ ఉంది.  క్లాస్​-లీడింగ్ 5-యాక్సిస్ ఇమేజ్ స్టెబిలైజేషన్, కొత్తగా డిజైన్ చేసిన గ్రిప్ లాంటివి ఉన్నాయి.  

ఓఎం-5 మార్క్​-2, 14-150ఎమ్ఎమ్ కెమెరా ధర రూ.1,39,990 కాగా, ఎం.జ్యూయికో డిజిటల్ ఈడీ 50-200ఎమ్ఎమ్ ఎఫ్2.8 ఐఎస్​ ప్రో లెన్స్ ధరను రూ.3,29,990గా నిర్ణయించారు.