మార్కెట్లకు మళ్లీ జోష్​

మార్కెట్లకు మళ్లీ జోష్​

ముంబై: హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్,  రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ వంటి షేర్లలో బలమైన కొనుగోళ్లతో ఈక్విటీ ఇండెక్స్​లు బుధవారం దాదాపు ఒక శాతం దూసుకెళ్లాయి.     ప్రారంభంలో కోల్పోయిన లాభాలను సంపాదించిన సెన్సెక్స్ 612.21 పాయింట్లు జంప్ చేసి 71,752.11 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 711.49 పాయింట్లు జూమ్ చేసి 71,851.39కి చేరుకుంది. నిఫ్టీ 203.60 పాయింట్లు పెరిగి 21,725.70 వద్దకు చేరుకుంది.  

సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ కంపెనీల్లో సన్‌‌‌‌‌‌‌‌ఫార్మా, టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌, స్టేట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా, మహీంద్రా అండ్‌‌‌‌‌‌‌‌ మహీంద్రా, మారుతీ, బజాజ్‌‌‌‌‌‌‌‌ ఫిన్‌‌‌‌‌‌‌‌సర్వ్‌‌‌‌‌‌‌‌, పవర్‌‌‌‌‌‌‌‌ గ్రిడ్‌‌‌‌‌‌‌‌, అల్ట్రాటెక్‌‌‌‌‌‌‌‌ సిమెంట్‌‌‌‌‌‌‌‌లు లాభపడ్డాయి. లార్సెన్  టూబ్రో డిసెంబర్ రిజల్ట్స్​కారణంగా 4 శాతానికి పైగా క్షీణించింది. టైటాన్ షేర్​ కూడా తగ్గింది. బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 1.83 శాతం ర్యాలీ చేయగా, మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 1.57 శాతం పెరిగింది.