మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ రూ.65.74 లక్షల కోట్లు

మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ  రూ.65.74 లక్షల కోట్లు

 

  • ఈ ఏడాది మార్చి నాటికి రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న ఏయూఎం
  • యూనిక్ ఇన్వెస్టర్లు 5.34 కోట్లు, పోలియోల సంఖ్య 23.45 కోట్లు
  • ఈక్విటీ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు కొనసాగుతున్న ఆదరణ: యాంఫి


న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్  మేనేజ్  చేస్తున్న ఆస్తులు (అసెట్స్ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్–ఏయూఎం) 2024-–25 ఆర్థిక సంవత్సరంలో ఏడాది లెక్కన 23 శాతం లేదా రూ.12 లక్షల కోట్లకు పైగా పెరిగి, రికార్డు స్థాయి రూ.65.74 లక్షల కోట్లకు చేరాయి. ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోస్ పెరగడంతో పాటు ఈక్విటీ, డెట్ మార్కెట్లలో   మార్కెట్‌ టు మార్కెట్‌ గెయిన్స్ (ఇంకా బుక్ చేయని) పెరగడంతో ఏయూఎం రికార్డ్ స్థాయికి చేరింది. మార్చి 2024లో ఇండస్ట్రీ ఏయూఎం రూ.53.40 లక్షల కోట్లుగా ఉంది.“ఏయూఎం పెరగడానికి  కొంతవరకు మార్క్- టు- మార్కెట్ (ఎంటీఎం) గెయిన్స్ కారణం.  ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడంతో నిఫ్టీ 50 టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ 6 శాతం, సెన్సెక్స్ టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ 5.9 శాతం పెరిగాయి. డెట్ మార్కెట్లు కూడా మంచి రాబడులను ఇచ్చాయి” అని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫి) సోమవారం విడుదల చేసిన యాన్యువల్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలిపింది.  ఇన్వెస్టర్లు,  మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు (అకౌంట్లు) కూడా పెద్ద మొత్తంలో పెరిగాయి.  ఫోలియోల సంఖ్య ఆల్-టైమ్ హై అయిన 23.45 కోట్లకు, ఇన్వెస్టర్ బేస్ సుమారు 5.67 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ- సంబంధిత  స్కీమ్స్ ఫోలియోలు సంవత్సరానికి 33.4 శాతం పెరిగి 16.38 కోట్లకు చేరాయి.  

మొత్తం ఫోలియోల్లో ఈ స్కీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందినవి 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి. హైబ్రిడ్ స్కీమ్స్ ఫోలియోలు 16 శాతం పెరిగి 1.56 కోట్లకు, ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) లాంటి ఇతర స్కీమ్స్ ఫోలియోలు  48.3 శాతం పెరిగి 4.15 కోట్లకు చేరాయి. కానీ డెట్-ఓరియెంటెడ్ స్కీమ్స్ ఫోలియోలు 3 శాతం తగ్గి 69.5 లక్షలకు పడ్డాయి.  సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాన్స్ (సిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) బాగా పాపులర్ అయ్యాయి. ఈ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 45.24 శాతం పెరిగి 2024–25లో రూ.2.89 లక్షల కోట్లను టచ్ చేశాయి.  ఈ భారీ పెరుగుదల, ఎంటీఎం గెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిపి, సిప్ ఏయూఎం రూ. 13.35 లక్షల కోట్లకు ఎగిసింది.  ఇది మొత్తం మ్యూచువల్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఇండస్ట్రీ ఏయూఎంలో 20.31 శాతం వాటాకు సమానం. మార్చి 2025 నాటికి, ఇండస్ట్రీలో మొత్తం 5.34 కోట్ల యూనిక్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. వీరిలో 26 శాతం లేదా 1.38 కోట్ల మంది మహిళలు. ఇది మార్చి 2024లో 24.2 శాతం నుంచి వృద్ధి చెందింది. ఈక్విటీ- ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ రికార్డు స్థాయిలో రూ.4.17 లక్షల కోట్ల  ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో చూశాయి.  ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోస్ రాలేదు.  డెట్ మ్యూచువల్ ఫండ్స్ 2024–25లో రూ.1.38 లక్షల కోట్ల నెట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోస్ నమోదు చేశాయి. ఈ కేటగిరీ ఏయూఎం 20.5 శాతం పెరిగి మార్చి 2025 నాటికి రూ.15.21 లక్షల కోట్లకు  చేరింది.