బండి సంజయ్​ తో ఎర్రబెల్లి ప్రదీప్​ రావు భేటీ

బండి సంజయ్​ తో ఎర్రబెల్లి ప్రదీప్​ రావు భేటీ

వరంగల్‍, వెలుగు: టీఆర్‍ఎస్‍ పార్టీకి రాజీనామా చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్‍ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు సోదరుడు ప్రదీప్‍రావు ఈ నెల 27న బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆ పార్టీ శ్రేణులు బండి సంజయ్‍ పాదయాత్ర ముగింపు సభను వరంగల్​లో నిర్వహించనున్న నేపథ్యంలో.. అదే రోజు పార్టీ పెద్దల సమక్షంలో బీజేపీలో చేరేలా సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఆయన అనుచరులు సైతం ఇది నిజమేనని చెబుతున్నారు. కాగా, ప్రదీప్‍రావు సోమవారం బండి సంజయ్‍ని పాదయాత్ర జరుగుతున్న స్టేషన్‍ ఘన్‍పూర్‍ నియోజకవర్గంలోని మీదికొండలో మర్యాద పూర్వకంగా కలిశారు.