గడీల పాలన ను బద్దలు కొట్టేందుకే ఈటల..

V6 Velugu Posted on Jun 14, 2021

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరారు. ఈ క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఢిల్లీలో మీడియా స‌మావేశంలో మాట్లాడారు. బీజేపీపై విశ్వాసంతో ఈట‌ల రాజేంద‌ర్ ఈ రోజు పార్టీలో చేరారని తెలిపారు. నియంతృత్వ పాల‌న నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని గొప్ప నిర్ణ‌యం తీసుకుని.. కాషాయ జెండా ప‌ట్టుకుని ముందుకు సాగాల‌ని, తెలంగాణలో 'గడీల పాలన'ను బద్దలు కొట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారని చెప్పారు. 

తెలంగాణ ప్ర‌జ‌ల సంక్షేమం కోసం బీజేపీ అండ‌గా ఉంటుందన్నారు బండి సంజయ్. కేసీఆర్‌ను ఎదుర్కొనే ద‌మ్ము, ధైర్యం ఉన్న‌ పార్టీ బీజేపీ అని ప్ర‌జ‌లు భావిస్తున్నారని తెలిపారు. బీజేపీ ఉద్య‌మంలో అంద‌రూ భాగ‌స్వామ్యం కావాల‌ని కోరుతున్నామన్నారు. ప్ర‌ధాని మోడీ పాల‌న‌లో ప్ర‌పంచంలో భార‌త్ శ‌క్తిమంతంగా త‌యార‌వుతోందన్నారు. న‌డ్డా నేతృత్వంలో బీజేపీ మ‌రింత శ‌క్తిమంతం అవుతోందని.. ఈ క్రమంలోనే ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేర‌డం సంతోషించ దగిన అంశమన్నారు బండి సంజయ్ .

Tagged etela, bandi sanjay, joined BJP, break Gadeela regime

Latest Videos

Subscribe Now

More News