ఈటల రాజేందర్ ఫోటోకు పాలాభిషేకం

V6 Velugu Posted on Aug 10, 2021

కరీంనగర్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫోటోకు దళితులు, బీసీలు పాలాభిషేకం నిర్వహించారు. వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో మంగళవారం దళిత బంధు పథకం  మాజీ మంత్రి ఈటల రాజేందర్ వల్లే వచ్చిందని పేర్కొంటూ.. ఆయన  ఫోటోకి పాలాభిషేకం చేసి కృతజ్ఘతలు తెలియజేశారు దళితులు, బీసీలు. ఈటల రాజేందర్ రాజీనామా చేయడం వల్లనే "దళితబంధు" పథకం వచ్చిందని ఈ సందర్భంగా స్థానికులు స్పష్టం చేశారు. దళితులకు ఇచ్చినట్టు బీసీ లకు కూడా బీసీ బంధు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. 
 

Tagged veenavanka mandal, , karimnagar today, dalith bandhu, BC Bandhu, bethigal village, daliths and bc people, anointed for eetela photo

Latest Videos

Subscribe Now

More News