
కొవిడ్ కారణంగా ఎన్నోసార్లు వాయిదా పడిన టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎట్టకేలకు మార్చ్ 25న విడుదల కాబోతోంది. దాంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య. ఈ నెల 14న ‘సెలెబ్రేషన్ యాంథమ్’ పేరుతో ఎత్తర జెండా అనే పాటను విడుదల చేయనున్నట్లు నిన్న ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్ ఎంతో అందంగా కనిపిస్తున్నారు.