ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్..2025లో 1.07 లక్షల యూనిట్లు సేల్

ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్..2025లో 1.07 లక్షల యూనిట్లు సేల్
  • 2028 నాటికి 7 శాతానికి పైగా పెరిగే చాన్స్​

న్యూఢిల్లీ: రాబోయే సంవత్సరాల్లో ఎలక్ట్రిక్​ కార్ల అమ్మకాలు బాగా పెరుగుతాయని కేర్​ఎడ్జ్​ అడ్వైజరీ రిపోర్ట్​వెల్లడించింది. కొత్త మోడల్ లాంచ్‌‌‌‌, ప్రభుత్వ మద్దతుతో 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో పెరుగుదల 7 శాతానికి మించి ఉంటుందని పేర్కొంది. అయితే,  అరుదైన ఖనిజాల సమస్య పరిష్కారం కావాలని స్పష్టం చేసింది. 

దీని రిపోర్ట్​ప్రకారం.. దేశంలో చార్జింగ్ మౌలిక సదుపాయాలను మరింత పెంచాలి. ఈవీలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలను బట్టి కూడా డిమాండ్​ఆధారపడి ఉంటుంది. మనదేశ ఎలక్ట్రిక్ కార్ల ఎకోసిస్టమ్​గత మూడు సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి సాధించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల యూనిట్లు అమ్ముడు కాగా, 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 1.07 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. 

పెరుగుతున్న ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలు,  పీఎల్1 పథకం కింద బ్యాటరీ లోకలైజేషన్​వల్ల ఈవీ వాడకం మరింత పెరుగుతుందని కేర్​ఎడ్జ్​ సీనియర్ డైరెక్టర్ తన్వీ షా అన్నారు. మొత్తం అమ్మకాల్లో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ల వాటా తక్కువగానే ఉన్నప్పటికీ, టూ, త్రీవీలర్ల అమ్మకాలు బాగున్నాయి. ఇక నుంచి ఫోర్​వీలర్​ విభాగం కూడా ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల దూసుకెళ్తుంది.  

గతంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కొనుగోలుకు అడ్డంకిగా ఉండిన చార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత ఇప్పుడు లేదు. వీటి సంఖ్య భారీగా పెరిగింది. గత మూడు సంవత్సరాలలో, దేశంలో పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య  2022 ఆర్థిక సంవత్సరంలో 5,151 నుంచి 2025 ప్రారంభం నాటికి 26 వేలకు పైగా పెరిగింది.

 ఫేమ్​2, వంటి కార్యక్రమాలు, అడ్వాన్స్​డ్​ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీల కోసం పీఎల్​ఐ స్కీమ్​, బ్యాటరీ ఖనిజాలపై బేసిక్​ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులు ఎలక్ట్రిక్​ కార్ల తయారీ ఖర్చులను తగ్గించాయని కేర్​ఎడ్జ్​ రిపోర్ట్​తెలిపింది.