ఎయిర్​పోర్టులో ఈవీ చార్జింగ్,   బయో డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లు

ఎయిర్​పోర్టులో ఈవీ చార్జింగ్,   బయో డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లు

హైదరాబాద్, వెలుగు: పర్యావరణ అనుకూల ఇంధనాలను ఎంకరేజ్​ చేయడంలో భాగంగా జీఎంఆర్​ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్​ఐఏఎల్​) ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్,  బయో-డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లను ప్రారంభించింది. ఈవీ చార్జింగ్ స్టేషన్ మెయిన్ కార్ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండగా, బయో-డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రజా రవాణా కేంద్రం (పీటీసీ) వద్ద ఉంది.  ఈవీ కస్టమర్లందరికీ ఈ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉంటుంది.

దీని కెపాసిటీ 30 కిలోవాట్లు. ఒక ఫోర్ వీలర్​ను గంటలో పూర్తిగా చార్జ్ చేస్తుంది. ఈ చార్జింగ్ స్టేషన్ యాప్ ద్వారా పని చేస్తుంది. అండ్రాయిడ్​, ఐఓఎస్​ యాప్స్​ ద్వారా వాడుకోవచ్చు. ఈవీ స్టేషన్లను నెలకొల్పడం వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్​ను ఎంకరేజ్​ చేసినట్టు అవుతుందని జీహెచ్​ఐఏఎల్​ పేర్కొంది. వీటితో కాలుష్యం సమస్య ఉండదని, విమానాశ్రయ చుట్టూ పరిసరాల్లో సౌండ్​ పొల్యూషన్​ తగ్గుతుందని పేర్కొంది. అంతేగాక విమానాశ్రయ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్  మరింత మెరుగవుతుంది. భారతీయ విమానాశ్రయాలలో మొట్టమొదటిసారిగా  జీహెచ్​ఐఏఎల్​ విమానాశ్రయంలో బయో-డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలయింది.  

సాధారణ డీజిల్ ఇంజన్లకు కూడా బయోడీజిల్​ను వాడొచ్చు. దీని వాడకం డీజిల్ ఇంజన్ల జీవితాన్ని పెంచుతుంది.  బయోడీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్​ను తగ్గిస్తుందని సంస్థ సీఈఓ ప్రదీప్ పణికర్ అన్నారు. జీహెచ్​ఐఏఎల్​ మొత్తం సోలార్ పవర్ సామర్థ్యం ఇప్పుడు 10 మెగావాట్లకు పెరిగిందని అన్నారు. దీంతో జీహెచ్​ఐఏఎల్​కు అవసరమైన సగం కరెంటు అందుతోందని ఆయన వివరించారు.