ఇలా చేస్తే.. నలభైల్లోనూ బరువు తగ్గడం ఈజీనే!

V6 Velugu Posted on May 31, 2021

వయసు పైబడుతన్న కొద్దీ జీవక్రియల వేగం తగ్గి, క్యాలరీలను కరిగించడం, బాడీని ఒక షేప్​లో ఉంచుకోవడం  కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అయితే నలభైల్లో కూడా ఈజీగా బరువు తగ్గొచ్చు.

అందుకు ఏం చేయాలంటే..

ప్రొటీన్​ ఫుడ్​ ఎక్కువ తినాలి.  గుడ్లు, పప్పులు, బీన్స్, మాంసం వంటి వాటిలో ప్రొటీన్​ బాగా దొరుకుతుంది. బరువు తగ్గడానికి క్యాలరీలు తక్కువగా ఉన్న డైట్​ తినడం చాలా  ముఖ్యం. అలాగని పూర్తిగా కార్బోహైడ్రేట్స్​ తినడం మానేయొద్దు. బాడీకి ప్రొటీన్లతో పాటు కార్బోహైడ్రేట్స్​ కూడా అంతే అవసరం. కాకపోతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినకుండా జాగ్రత్త పడాలి. స్వీట్లు, జంక్​ ఫుడ్​ మీదకు మనసు మళ్లినప్పుడు డార్క్​ చాక్లెట్స్​ తినాలి. దాంతో జింక్​, ఇతర అత్యవసర పోషకాలు అందుతాయి. డార్క్​ చాక్లెట్స్​ తింటే ఒత్తిడి తగ్గడమే కాకుండా చక్కగా నిద్ర పడుతుంది. కొత్తగా వచ్చే ప్రతి డైట్​ అందరికి సరిపడకపోవచ్చు. పోషకాలు సరిపడా లభించే, ఆరోగ్యంగా ఉండే డైట్​నే కంటిన్యూ చేయాలి.

Tagged food, life style, Weight Loss,

Latest Videos

Subscribe Now

More News