- డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కామెంట్స్
భైంసా, వెలుగు : భైంసా మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే, సీఎం కాళ్లు మొక్కైనా అభివృద్ధి చేయించే బాధ్యత తీసుకుంటానని ఖానాపూర్ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు అన్నారు. దేశంలోనే భైంసాను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానన్నారు. బుధవారం నిర్మల్‌జిల్లా భైంసాలోని ఫంక్షన్హాల్లో పార్టీ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన మున్సిపల్ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ, ఎంఐఎం మత రాజకీయాలు చేస్తున్నాయని, హిందూ, ముస్లింల మధ్య కొట్లాట పెట్టేలా వ్యవహరిస్తున్నా యని మండిపడ్డారు. కాంగ్రెస్ అన్నివర్గాలను కలుపుకుపోయే పార్టీ అన్నారు. భైంసాలో కాంగ్రెస్ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తే ఎంఐఎం కోర్టులో కేసు వేసి మరీ అడ్డుపడిందని గుర్తు చేశారు. బీజేపీ, ఎంఐఎం గుండాయిజం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. మత రాజకీయాలు చేసే పార్టీలు మున్సిపల్‌ఎన్నికల్లో కోట్లాటలు పెడితే తొక్కేస్తామన్నారు. తాను చూస్తే చిన్నోడిలా ఉంటానని, అణుబాంబుతో సమానమన్నారు.
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పాటు పడుతున్నది కాంగ్రెస్ సర్కారు అని పేర్కొన్నారు. భైంసాలో 26వ వార్డుల్లో కాంగ్రెస్20 వార్డులు గెలిచి తీరుతామన్నారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ఆనంద్రావు పటేల్, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
