IMRAN KHAN: నన్ను చంపేయొచ్చు.. ఇమ్రాన్ వీడియో

IMRAN KHAN: నన్ను చంపేయొచ్చు.. ఇమ్రాన్ వీడియో

పాకిస్తాన్  మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్రమాస్తుల  కేసులో  ఇమ్రాన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటి వద్దకు వచ్చారు.  ఇమ్రాన్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) కార్యకర్తలు ఇమ్రాన్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు.  ఈ క్రమంలో ఇమ్రాన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. 

ఈ  నేపథ్యంలో ఇమ్రాన్  ఆ దేశ ప్రజలనుద్దేశించి ఓ వీడియోను రిలీజ్ చేశారు. తనను పోలీసులు జైల్లో వేసినా.. చంపినా మీ హక్కుల కోసం పోరాడాలని కోరారు.  “నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. ఇమ్రాన్‌ఖాన్‌ జైలుకు వెళితే ప్రజలు నిద్ర పోతారని వారు భావిస్తున్నారు. ఇది తప్పు అని మీరు నిరూపించాలి. ప్రజలు బతికే ఉన్నారని మీరు తెలియజేయాలి. వీధుల్లోకి వచ్చి మీ హక్కుల కోసం పోరాడాలి. నాకు ఏదైనా జరిగితే వాళ్లు  జైల్లో వేయొచ్చు లేదా చంపేయొచ్చు. ఇమ్రాన్ లేకపోయినా మీరు మీ హక్కుల కోసం పోరాడాలి. ప్రజలు బానిసతత్వాన్ని అంగీకరించబోరని  నిరూపించాలి. పాకిస్తాన్ జిందాబాద్’’ అని ఇమ్రాన్ పిలుపునిచ్చారు.