కేటీఆర్ ఐటీ మంత్రి అయినా.. సిరిసిల్ల బిడ్డలకు ఒక్క జాబ్ కూడా రాలే

కేటీఆర్ ఐటీ మంత్రి అయినా.. సిరిసిల్ల బిడ్డలకు ఒక్క జాబ్ కూడా రాలే

రాజన్న సిరిసిల్ల, వెలుగు : కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి అయినా సిరిసిల్ల యువతకుఒక్క ఐటీ జాబ్  కూడా కల్పించలేదని సిరిసిల్ల బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి రాణీ రుద్రమ అన్నారు. గురువారం సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ప్రజలకు బీఆర్ఎస్  ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, కొత్త పెన్షన్ లు అందించలేదని, ఉద్యోగాలు కల్పించలేదని మండిపడ్డారు. కేటీఆర్  అనుచరులు నయీయ్  లాగా తయారయ్యారని ధ్వజమెత్తారు. ‘‘చిన్నపిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసిన నాయకులపై చర్యలు తీసుకోకుండా వదిలేశారు.

సిరిసిల్ల గురుకుల పాఠశాలల్లో పురుగుల అన్నం పెడుతున్నారు. సిరిసిల్లను అభివృద్ధి చేసిన అని కేటీఆర్  పదేపదే  చెప్పుకుంటున్నాడు. అట్లయితే చిన్నపాటి వానకే ఊరు ఎందుకు మునుగుతున్నది” అని రుద్రమ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సిరిసిల్లకు ఫ్లడ్స్ రాకుండా చర్యలు తీసుకుంటామని, ఇక్కడ పవర్ లూమ్ క్లస్టర్  ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మెగా పవర్ లూమ్  టెక్స్ టైల్స్  పార్కు ప్రకటిస్తే దాన్ని సిరిసిల్లలో ఏర్పాటు చేసేందుకు కేటీఆర్  ప్రయత్నం చేయలేదని విమర్శించారు.