
ఎన్నికల కోడ్ లేకపోతే హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన "నీరా కేఫ్" ను ఈ నెలలోనే ప్రారంభించే వాళ్లమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గీత కార్మికులపై ఎక్సైజ్ శాఖ అధికారులు వేధింపులుండేవన్నారు. రాజకీయంగా గీత కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ కల్లు దుకాణాలు రీ ఓపెన్ చేయించారని చెప్పారు. నాగరికత నేర్పిన రోమ్ నగరంలో కూడా ఈత, తాటి చెట్లకు ప్రాధాన్యత ఉందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.