వైరల్: బాటిల్ మూతను తెరిచిన తేనెటీగలు

వైరల్: బాటిల్ మూతను తెరిచిన తేనెటీగలు

కలసికట్టుగా పోరాడితే ఏదైనా చేయొచ్చు, ఐకమత్యమే మహాబలం లాంటి సూక్తులను వినే ఉంటాం. ఈ వీడియోలోని తేనెటీగలను చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. రెండు తేనెటీగలు కలసి ఓ బాటిల్ మూతను తీసిన వీడియో నెట్‌‌లో వైరల్ అవుతోంది. ఫాంటా కూల్ డ్రింక్‌‌ బాటిల్ మీద వాలిన తేనెటీగలు.. మెళ్లిమెళ్లిగా ప్రయత్నిస్తూ మూతను తీయడాన్ని వీడియోలో చూడొచ్చు. ఐకమత్యంతో ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తున్న ఈ తేనెటీగల నుంచి మనమూ స్ఫూర్తిని పొందాల్సిందేనని వీడియోను చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో కలసికట్టుగా కొవిడ్ రూల్స్‌‌, లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ వైరస్‌‌ను తరిమికొడదామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరూ ఈ వీడియోను చూసేయండి.