
సెప్టెంబర్ 17పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతీ ఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 17న అధికారిక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రం గెజిట్ లో పేర్కొంది.
గత కొన్నేళ్లుగా సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ Hyderabad విమోచన దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది...లోక్ సభ Lokasbha ఎన్నికల వేళ సెప్టెంబర్ 17కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగా నిర్వహించనున్నారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వస్తే హైదరాబాద్ సంస్ధానానికి సెప్టెంబర్ 17, 1948లో వచ్చింది. ఆపరేషన్ పోలో పేరిట చేపట్టిన పోలీస్ యాక్షన్ ద్వారా ఇండియాలో ఈ సంస్ధానం విలీనమయ్యింది. హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తనున్నారని హైదరాబాద్ సంస్ధాన విముక్తి కోసం పొరాడి అమరులైన వారిని స్మరించుకోవడానికి సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించాలని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు. సాయుధ రైతాంగ పోరాటం చేపట్టి నిజాంకు ముచ్చెమటలు పట్టించారు. రజాకార్ల ఆగడాలను తట్టుకోలేక ప్రజలు పోరాటం చేసారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి తోడుగా సర్ధార్ పటేల్ నేతృత్వంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని సెప్టెంబర్ 17, 1948న ఇండియాలో విలీనం అయ్యేలా చేసింది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలలకు హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం వచ్చింది.అప్పటి నుంచి తెలంగాణ ప్రజలు సెప్టెంబర్ 17న ప్రతి ఏటా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటారు. కాగా తాజాగా కేంద్రం ఇక నుంచి ఈ రోజును హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని గెజిట్ జారీ చేసింది.