నిన్నటి దాకా తండ్రి ఉరి కోసం డిమాండ్.. నేడు నాపై అడ్డమైన ఆరోపణలు

నిన్నటి దాకా తండ్రి ఉరి కోసం డిమాండ్.. నేడు నాపై అడ్డమైన ఆరోపణలు

డబ్బు కోసమే అమృత డ్రామాలు ఆడుతుందని తెలిపాడు. మారుతీరావు సోదరుడు శ్రవణ్. మారుతీ రావు చనిపోయే వరకు ఉరి తీయాలని అమృత డిమాండ్ చేసిందని..ఇపుడు అడ్డమైన ఆరోపణలు చేస్తుందన్నాడు. ప్రణయ్ హత్యకు ముందు మారుతీరావుకు.. తనకు మాటలు లేవని.. అమృత విషయంలోనే గొడవలు తలెత్తాయన్నాడు. మాటలు లేవనే విషయం వాళ్లకు తెలుసని..  తనపై అనవసర ఆరోపణలు చేస్తుందని తెలిపాడు. తన వల్ల అపాయం ఉందంటే దేనికైనా సిద్ధమని చెప్పాడు శ్రవణ్. తండ్రి చనిపోతే అమృత శుభ వార్త అన్నదని తెలిసిందన్నాడు.

మారుతీ రావు చనిపోయాక..  ఆయన వెనకాల ఉన్న ఆస్తిని రాబట్టుకునేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపాడు.  మారుతి రావు ఏం తీసుకుపోయాడు… నేను ఎం తీసుకుపోను. నిన్నటి వరకు తండ్రి చావాలని కోరుకున్న అమృతకు.. ఇపుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ అని ప్రశ్నించాడు. అమృత చేసిన ఈ చెత్త పనికే ఇన్న పరిణామాలు జరుగుతున్నాయని.. నేను బెదిరించే వాణ్ణి  అయితే నా పేరు ఎందుకు బయటకు రాదు. చచ్చాక తండ్రిపై  ప్రేమ ఎందుకు పుట్టుకొస్తుంది.

నాన్న అని పిలవడానికి కూడా ఆమెకు మాట రావడం లేదు. తల్లి మీద ప్రేమ ఉంటే… నిన్నటి నుంచి ఎందుకు రాలేదు. మీడియాలో కనిపించడం కోసం డ్రామాలు. వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తే… నాకేం అభ్యంతరం లేదు.  దినాల తర్వాత కలిస్తే… నాకేం అవసరం లేదు. అన్యాయంగా నన్ను జైలుకు పంపించారు. మళ్ళీ నన్ను చంపడానికి ఏవో ఆరోపణలు చేస్తుందని చెప్పుకొచ్చాడు అమృత బాబాయ్ శ్రవణ్.

see also: 60 ఏళ్లకు పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ నేత

మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడు

కళ్యాణి ప్రియదర్శినికి శక్తి ఎంటో చూపించాడు