కౌంటింగ్‌‌‌‌‌‌‌‌కు అంతా రెడీ.. నాలుగు జిల్లాకేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి

కౌంటింగ్‌‌‌‌‌‌‌‌కు అంతా రెడీ.. నాలుగు జిల్లాకేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
  • తేలనున్న 12 నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం 
  • ఉదయం 8గంటల నుంచే కౌంటింగ్​

కరీంనగర్/రాజన్నసిరిసిల్ల/జగిత్యాల/పెద్దపల్లి, వెలుగు :  నవంబర్ 30న పోలైన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌‌‌‌‌‌‌‌కు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత ఈవీఎంల్లో పోలైన ఓట్లను లెక్కిస్తారు. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గాల ఓట్లను లెక్కించబోతున్నారు.

పెద్దపల్లి జిల్లాకు చెందిన పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల ఓట్లను రామగిరి మండలంలోని జేఎన్‌‌‌‌‌‌‌‌టీయూ కాలేజీలో, అలాగే సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల ఓట్లను సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల స్కూల్‌‌‌‌‌‌‌‌లో, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి ఓట్లను జగిత్యాలలోని వీఆర్ కే కాలేజీలో లెక్కించనున్నారు. 

కౌంటింగ్‌‌‌‌‌‌‌‌కు ఏర్పాట్లు పూర్తి 

  • కరీంనగర్ నియోజకవర్గంలో 27 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి తరలించిన 390 ఈవీఎంల్లోని 2,24,504 ఓట్లు , 1700 పోస్టల్ ఓట్లను లెక్కించడానికి 22 మంది కౌంటింగ్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్లు, 28 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 22 మంది మైక్రో అబ్జర్వర్లు, 16 మంది రిజర్వు సిబ్బందితో కలిపి మొత్తం 88 మందిని నియమించారు. 16 కౌంటింగ్ టేబుల్స్, 6 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. కరీంనగర్ ఓట్లను 25 రౌండ్లలో లెక్కించనున్నారు. 
  • మానకొండూరులో 10 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ నియోజకవర్గంలోని 316 ఈవీఎంల్లోని 1,84,413 ఓట్లు, 1475 పోస్టల్ ఓట్లను లెక్కించడానికి 17 మంది కౌంటింగ్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్లు, 20 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 17 మంది మైక్రో అబ్జర్వర్లను, 14 మంది రిజర్వ్ స్టాఫ్ తో కలిపి 68 మందిని నియమించారు. 14 కౌంటింగ్ టేబుల్స్, 2 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. 23 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.
  • హుజూరాబాద్ నియోజకవర్గంలో 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 305 ఈవీఎంల్లోని 2,07,609 ఓట్లు, 1980 పోస్టల్ ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకు 17 మంది కౌంటింగ్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్లు, 20 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 17 మంది మైక్రో అబ్జర్వర్లు, 15 మంది రిజర్వ్ స్టాఫ్ తో కలిపి 69 మందిని నియమించారు. 14 కౌంటింగ్ టేబుల్స్, 3 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఏర్పాటు చేశారు.22 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. 
  • చొప్పదండి నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 327 ఈవీఎంల్లోని  1,81,194 ఓట్లు, 974 పోస్టల్ ఓట్లను లెక్కించడానికి 14 కౌంటింగ్ టేబుల్స్, 2 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. చొప్పదండి ఓట్లను 25 రౌండ్లలో లెక్కించనున్నారు. 16 మంది కౌంటింగ్ సూపర్​వైజర్లు, 18 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 16 మంది మైక్రో అబ్జర్వర్లు, 14 మంది రిజర్వ్ స్టాఫ్ తో కలుపుకొని 64 మందిని నియమించారు. మొత్తంగా ఎస్ఆర్ఆర్ కాలేజీలో మొత్తం 305 మంది సిబ్బంది కౌంటింగ్ విధులు నిర్వర్తించనున్నారు.  
  • జగిత్యాల నియోజకవర్గంలో మొత్తం 2,31,648 ఓటర్లు ఉండగా 1,74,584 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్‌‌‌‌‌‌‌‌లో మొత్తం 14 టేబుల్స్ 19 రౌండ్లలో లెక్కించనున్నారు. 
  • కోరుట్ల నియోజకవర్గంలో 2,40,855 ఓట్లు ఉండగా 1,82,140 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 14 టేబుల్స్ 19 రౌండ్లలో లెక్కించనున్నారు. 
  • ధర్మపురి నియోజకవర్గంలో మొత్తం 2,26,880 మంది ఓటర్లు ఉండగా 1,79,271 ఓట్లు పోలయ్యాయి. 14 టేబుల్స్ 20 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. 
  • పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం 2,54,266 ఓట్లు ఉండగా.. 2,07,397 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లను లెక్కించేందుకు కౌంటింగ్​టేబుల్స్​ 14 ఏర్పాటు చేశారు.  18రౌండ్లలో ఫలితాలను
  • వెల్లడించనున్నారు. 
  •  మంథని నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,36, 442 ఉండగా 1,95,635 ఓట్లు పోలయ్యాయి. వీటిని లెక్కించేందుకు 14 టేబుల్స్​ ఏర్పాటు చేశారు. 18 రౌండ్లలో ఫలితం తేలనుంది. 
  •  రామగుండంలో మొత్తం ఓట్లు 2,21,019 ఉండగా  1,51, 865 ఓట్లు పోలయ్యాయి. వీటిని లెక్కించేందుకు 14 టేబుల్స్​ ఏర్పాటు చేశారు.
  • 16 రౌండ్లలో విజేతలను ప్రకటించనున్నారు. 
  • సిరిసిల్ల నియోజకవర్గంలో 1,88,202 ఓట్లు పోల్​అయ్యాయి. వీటిని లెక్కించేందుకు 14 టేబుల్స్​ ఏర్పాటు చేశారు. పోస్టల్​బ్యాలెట్​ఓట్లను లెక్కించేందుకు 4 టేబుల్స్​ ఏర్పాటుచేశారు. ఫలితాలు 21 రౌండ్లలో తేలనున్నాయి.  
  • వేములవాడ  నియోజకవర్గంలో 1,74,300 ఓట్లు పోల్​కాగా 14 టేబుల్స్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌‌‌‌‌‌‌‌కు 3 టేబుల్స్ ఏర్పాటుచేశారు. 19 రౌండ్లలో కౌంటింగ్ రిజల్ట్​రానుంది. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వహిస్తారు. 

కౌంటింగ్ ముగిసే దాకాసెంటర్ వదిలి వెళ్లొద్దు 

  • అబ్జర్వర్ సీఆర్ ప్రసన్న కుమార్

కౌంటింగ్ డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎవరూ కూడా లెక్కింపు ముగిసేవరకు కౌంటింగ్ కేంద్రాన్ని వదిలి వెళ్లొద్దని కౌంటింగ్ ఆబ్జర్వర్ సీఆర్ ప్రసన్న కుమార్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం అకౌంటింగ్ సూపర్ వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమంలో కౌంటింగ్ అబ్జర్వర్లు సీఆర్ ప్రసన్న, ఎస్ జె చౌడ, మనిష్ కుమార్ లోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ హాల్ లో మైక్రో అబ్జర్వర్లు

ఉదయం 6 గంటలకే హాజరుకావాలని, కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ లాంటి పరికరాలను తీసుకురావొద్దని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ కలెక్టర్ సదానందం, మార్కెటింగ్ అధికారి పద్మావతి, ఎల్‌‌‌‌‌‌‌‌డీఎం ఆంజనేయులు, డీఈవో జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.