మొరాయిస్తున్న ఈవీఎంలు.. పడిగాపులు కాస్తున్న ఓటర్లు

మొరాయిస్తున్న ఈవీఎంలు.. పడిగాపులు కాస్తున్న ఓటర్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. చందుర్తి మండలంలోని కట్ట లింగంపేట గ్రామంలో పోలింగ్ బూత్ 101లో ఈవీఎంలు మొరాయించాయి. రెండు గంటల నుండి ఈవీఏంలు పనిచేయక ఓటర్లు పడిగాపులు కాస్తున్నారు. 718 ఓట్లకు 245 పోలింగ్ నమోదయ్యాయి. ఈవీఎం మొరాయించడంతో ఓట్లు వేయకుండా ఓటర్లు వెనుదిరిగారు.

కంట్రోల్ యూనిట్ ఫెల్ కావడంతో ఇబ్బంది అయిందని పోలింగ్ ఆఫీసర్ శంకర్ తెలిపారు. మళ్ళీ కొత్తగా ఈవీఎంను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు పోలింగ్ సిబ్బంది. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.