
భద్రాచలం, వెలుగు: తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణానికి, రామయ్య పట్టాభిషేకానికి అవసరమైన పట్టువస్త్రాలను అందించేందుకు భద్రాచలంలో మంగళవారం మగ్గం పనులను షరూ చేశారు.
ఈ పనులను ఈవో ఎల్.రమాదేవి ప్రారంభించారు. అర్చకులు మగ్గాలకు పూజలు నిర్వహించారు. ప్రతీ సంవత్సరం సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్.జయరాజు ఆధ్వర్యంలో చేనేత కళాకారులు నిష్టతో మగ్గంపై పట్టు వస్త్రాలను నేస్తున్నారు.