ఎవాల్వ్​28.. ఇది పెట్టుకుంటే బ్రెయిన్​కూల్​

 ఎవాల్వ్​28.. ఇది పెట్టుకుంటే బ్రెయిన్​కూల్​

హైదరాబాద్​, వెలుగు :  మానసిక ఒత్తిడిని తగ్గించే ఎవాల్వ్​28 అనే డివైజ్​ను హెల్త్​టెక్​​స్టార్టప్​ ఎథర్ మైండ్ టెక్ అందుబాటులోకి తెచ్చింది. దీనిని బ్లూటూత్ మాదిరిగా మెడ చుట్టూ పెట్టుకోవాలి.   అయస్కాంత క్షేత్రాన్ని మెదడు చుట్టూ సృష్టిస్తుందని,  మనసుని కంట్రోల్ చేసుకోవడంలో సాయపడుతుందని ఎథర్​  తెలిపింది.

మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ వేరబుల్​డివైజ్​కు ఎఫ్​సీసీ (అమెరికా), సీఈ (యూరప్​), డబ్ల్యూపీసీ (ఇండియా), ఐఎస్​ఈడీ (కెనడా)ల అప్రూవల్​ ఉందని కంపెనీ ప్రకటించింది.