బంగ్లా జాతిపితను హత్య చేసిన మాజీ కెప్టెన్ కు ఉరి

బంగ్లా జాతిపితను హత్య చేసిన మాజీ కెప్టెన్ కు ఉరి

బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ మాజీ సైనిక కెప్టెన్ అబ్దుల్ మాజిద్ ను శనివారం అర్ధరాత్రి ఉరితీశారు. బంగ్లా దేశ్ జాతిపిత, ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహ్మాన్ హత్యకు పాల్పడినట్లు ఆయన పై ఆరోపణలు ఉన్నాయి. 1975 లో బంగ్లాదేశ్ తిరుగుబాటులోనూ కీలకంగా వ్యవహారించారంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. దాదాపు 45 ఏళ్ల తర్వాత ఈ సంఘటనలకు సంబంధించి ఆయనను ఉరి తీశారు. ముుజిబుర్ రెహ్మాన్ 1975 ఆగస్టు 15 న హత్యకు గురయ్యారు. 1998 లో అబ్బుల్ మాజిద్ తో పాటు మరో 12 మందికి హత్యతో ప్రమేయముందని బంగ్లా సుప్రీం కోర్టు తేల్చింది. అప్పటికే మాజిద్ పరారీలో ఉన్నారు. 1996 లోనే మాజిద్ భారత్ కు వచ్చారని అనుమానాలున్నాయి. ఐతే వారం రోజుల క్రితం బంగ్లాదేశ్ రిక్షాలో ప్రయాణిస్తుండగా గుర్తించి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. క్షమాభిక్ష కోరినప్పటికీ అధ్యక్షుడు రిజెక్ట్ చేశారు. దీంతో శనివారం అర్థరాత్రి 12 గంటలకు ఆయనను ఉరి తీశారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ న్యా శాఖ మంత్రి అనిసుల్ హాక్ మీడియాకు వెల్లడించారు.