బొమ్రాస్ పేటలో 920 ఎకరాల భూమి కబ్జా: మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్

బొమ్రాస్ పేటలో 920 ఎకరాల భూమి కబ్జా: మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామీర్పేట్ మండలం బొమ్రాస్ పేట  గ్రామంలో ఎన్నారై లకు చెందిన 920 ఎకరాల భూకబ్జాపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. ఈ భూకబ్జా వెనుక బిఆర్ఎస్ ముఖ్య నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ వాస్తవాలను సేకరించి భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బొమ్రాస్పేట్ గ్రామం పరిధిలోని సర్వే నెంబర్ 323 నుంచి 409 వరకు ఉన్న 1049 ఎకరాల భూమిలో 920 ఎకరాల భూమిని కబ్జా చేశారని రైతు సంఘం ముసుగులో ఈ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మాజీ ఎంపీ దుగ్గిరాల బలరామకృష్ణ 1965 లో ఈ భూమిని మీర్ రెహ్మత్ అలీతో పాటు మరో ఆరుగురి నుంచి కొనుగోలు చేశారని తెలిపారు. ఆయన వారసులైన దుగ్గిరాల అమరెందర్ బాబు లతో పాటు మరో 20 మంది పేరిట ఈ భూమి రిజిస్టర్ అయిందని తెలిపారు. ఈ భూమి హక్కుదారులు విదేశాలలో స్థిరపడడంతో ఈ భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కొంత మంది కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు.