- హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ ఆమీర్ పిటిషన్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో 2022లో నమోదైన కేసులో తనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నందున ముం దస్తు బెయిల్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ కొడుకు మహమ్మద్ రహీల్ ఆమీర్ హైకోర్టును ఆశ్రయించాడు. బుధవారం హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమీర్ నడిపినట్లుగా భావిస్తున్న కారు.. కేబుల్ బ్రిడ్జి నుంచి వస్తూ ఓ ఫ్యామిలీని ఢీకొట్టింది. దాంతో ఆమీర్ పై 2022 మార్చి 17న కేసు నమోదైంది. ఘటన జరిగిన రెండేండ్ల తర్వాత తనపై రాజకీయ కక్షతో కేసు విచారణ వేగవంతం చేశారని పిటిషన్‌లో ఆమీర్ ఆరోపించాడు.ఇందులో భాగంగా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఇక్కడే ఆస్తులు ఉన్నాయని, ఎక్కడికీ పారిపోయే అవకాశమే లేదని..తనకు ముందస్తు బెయిల్మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది.