రాష్ట్రంలో దుష్ట పాలన సాగుతోంది

రాష్ట్రంలో దుష్ట పాలన సాగుతోంది

దేశవ్యాప్తంగా అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న తెలిసిందే. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సైన్యాన్ని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అగ్నిపథ్ అంటే సైన్యాన్ని నిర్వీర్యం చేయడమే అని రాజయ్య మండిపడ్డారు. సికింద్రాబాద్ ఘటనలో పోలీసుల కాల్పుల్లో దామోదర రాకేశ్ మృతి బాధాకారం అన్నారు. రాకేశ్ ను టీఆర్ఎస్ సర్కార్ రే చంపింది, మళ్లీ సర్కారే ర్యాలీ తీసిందని రాజయ్య విమర్శించారు. సికింద్రాబాద్ ఘటనలో టీఆర్ఎస్ కేడరే విధ్వంసం సృష్టించిందన్నారు. రాష్ట్రంలో దుష్ట పరిపాలన సాగుతోందని రాజయ్య దుయ్యబట్టారు.