అంబేద్కర్‌ జయంతికి సీఎం రావాలె :వివేక్‌ వెంకటస్వామి

అంబేద్కర్‌ జయంతికి సీఎం రావాలె :వివేక్‌ వెంకటస్వామి
  • 2020లోనైనా రావాలని కోరుతున్నాం
  • 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం అని మోసం చేశారు: మందకృష్ణ
  • చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తాం : భట్టి
  • ట్యాంక్‌బండ్‌ దగ్గర ఘనంగా అంబేద్కర్‌ జయంతి వేడుకలు

హైదరాబాద్, వెలుగు: ‘దళితులకు ఉన్నది ఒక్కటే కోరిక. ముఖ్యమంత్రిగా ఎవరున్నా సరే.. అంబేద్కర్‌ జయంతి రోజు నివాళులు అర్పించడానికి రావాలి’అని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. 2020లోనైనా ఈ కార్యక్రమానికి సీఎం రావాలని దళితుల పక్షాన కోరుతున్నానన్నా రు. గతంలో ఇదే అంశంపై చాలా సార్లు మాట్లాడిన కేటీఆర్ కూడా సీఎం వచ్చి పూలమాల వేస్తారని హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భం గా దళిత, ప్రజా సంఘాలు, ప్రముఖులు ట్యాంక్‌బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తా త్రేయ, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మార్పీ ఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ,  హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాం చందర్ రావు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి హాజరయ్యారు. వివేక్‌ మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ సాధించుకున్నాం. బానిసత్వం నుంచి విముక్తికి రిజర్వేషన్లు వచ్చాయి’ అని గుర్తు చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలన్నా రు. విగ్రహం కూల్చి వేతపై విచారణ జరిపించాలని, విగ్రహాన్ని పునః ప్రతిష్టించాలని సర్కా రును డిమాండ్ చేశారు. అనంతరం భువనగరి మండలం రాయిగిరిలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో కూడా వివేక్ పాల్గొన్నా రు.

గిట్టని వాళ్లే చేసుంటారు : మంత్రి తలసాని

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్‌ సర్కారు నడుస్తోందని మంత్రి తలసాని చెప్పారు. విగ్రహం కూల్చి వేత ఘటనను సీనియర్ ఐఏఎస్ అధికారి విచారిస్తున్నా రని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే గల్లీగల్లీలో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారన్నారు. గిట్టని వాళ్లు ఉద్దేశపూర్వకంగా పంజాగుట్టలో విగ్రహాన్ని కూల్చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ ఒక్కసారి రాలేదు: మంద కృష్ణ

రాష్ట్రం లో దళితులకు గుర్తింపు లేదని, అన్యాయం జరిగిందని మంద కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం అంటూ నమ్మించి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ‘రాష్ట్రం ఏర్పడక ముందు జయంతి రోజు ప్రతి సీఎం వచ్చి నివాళులర్పించేవారు. కానీ కేసీఆర్ ఒక్కసారి కూడారాలేదు’ అని దుయ్యబట్టారు.

కుల నిర్మూలన చట్టం తీసుకురావాలి: కృష్ణయ్య

దేశంలో కుల నిర్మూలన చట్టం తీసుకురావాలని బీసీసంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. అప్పుడే అంబేద్కర్ కు నిజమైన నివాళి అర్పించినట్లని చెప్పారు. విద్యానగర్ బీసీ భవన్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించిన తర్వాత మాట్లాడారు. దేశంలో కులం భయంకరవ్యాధిలా తయారైం దని.. దానికి మందులు, చికిత్స లేవని చెప్పా రు.

రాజ్యాంగ విరుద్ధంగా పాలన: భట్టి

రాజ్యాం గ విరుద్ధంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నా రని భట్టి విమర్శించారు. కాం గ్రెస్‌ నుం చి గెలిచిన ఎమ్మెల్యే లను ప్రలోభపెట్టి పార్టీ మారేలా ఒత్తిడి చేస్తున్నా రని మండిపడ్డారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని విరగ్గొట్టి చెత్తబండిలో తీసుకెళ్లడం రాజ్యాం గాన్ని గౌరవిం చే ప్రతి ఒక్కరినీ అవమానిం చడమేనన్నా రు.  విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే కాం గ్రెస్‌ పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరిం చారు.