దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‎‎కు 5 సంవత్సరాల జైలు శిక్ష

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‎‎కు 5 సంవత్సరాల జైలు శిక్ష

సియోల్: మార్షల్ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు న్యాయస్థానం 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. యూన్ సుక్ యోల్‌పై అభియోగాలు రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. 

అసలేం జరిగిందంటే..?

దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ 2024 డిసెంబర్ లో దక్షిణా కొరియోలో అప్పటి దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ ఎమర్జెన్సీ మార్షల్ లా(సైనిక పాలన) పాలన విధించారు. దేశ పార్లమెంటును ప్రతిపక్షాలే కంట్రోల్ చేస్తున్నాయి. దేశ బడ్జెట్​కు విలువ లేకుండా చేశాయి. నిధులను తగ్గించి న్యాయ, పరిపాలనా వ్యవస్థలను స్తంభింపజేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఉత్తర కొరియా పట్ల సానుభూతితో దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయి. తద్వారా సౌత్ కొరియా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నాయి. అందుకే 'ఎమర్జెన్సీ మార్షల్ లా' అమలు చేయాల్సి వస్తున్నది. దీనిద్వారా వీలైనంత త్వరగా దేశ వ్యతిరేక శక్తులతోపాటు నార్త్  కొరియా అనుకూల శక్తులనూ నిర్మూలిస్తాను. రాజ్యాంగంతోపాటు ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. దేశాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకువస్తాను" అని యూన్ పేర్కొన్నారు. 

ఎమర్జెన్సీ మార్షల్ లా అమలును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం తీసుకురాగా పార్లమెంట్‌‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో యూన్ అభిశంసన వేటుకు గురయ్యారు. ఆ తర్వాత మార్షల్ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు యూన్‎ అరెస్ట్ అయ్యారు.

దక్షిణ కొరియా చరిత్రలో సిట్టింగ్ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం సియోల్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచబడిన యూన్‎కు న్యాయస్థానం ఐదేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో యూన్ మరణ శిక్ష విధించాలని దాఖలైన పిటిషన్లపై 2026, ఫిబ్రవరిలో న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.