నీట్ యూజీ ఫలితాలు విడుదల చేయలే: కేంద్ర విద్యాశాఖ

నీట్ యూజీ ఫలితాలు విడుదల చేయలే: కేంద్ర విద్యాశాఖ

నీట్‌ యూజీ 2024 తుది ఫలితాల విడుదలలో గందరగోళం నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తుది ఫలితాలను ప్రకటించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించగా.. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ మాత్రం సవరించిన మర్కులకు సంబంధించిన ఫలితాలను తాము ఇంకా విడుదల చేయలేదని పేర్కొంది. విద్యార్ధులు ఫలితాలను ఇప్పుడే చూసుకోలేరని, త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఇప్పుడు వైరల్‌ అవుతున్న లింక్‌ పాతదని స్పష్టం చేసింది.  కాగా నీట్‌ యూజీ-2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సవరించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసినట్లు  వార్తలు వస్తున్నాయి.

ఫిజిక్స్ సబ్జెక్టులో ఎంపిక చేసిన కొంతమంది అభ్యర్థులకు కలిపిన మార్కులను తొలగించాలని మంగళవారం నాడు సుప్రీంకోర్టు చేసిన సూచనల తర్వాత ఎన్టీఏ నీట్ యూజీ తుది ఫలితాలను విడుదల చేసింది.  ఇంతకుముందు 12వతరగతి NCERT సైన్స్ పాఠ్య పుస్తకంలో తప్పుగా సమాధానమిచ్చిన విషయంలో కొంతమంది విద్యార్థులకు అదనపు మార్కులు కలపాలని ఎన్టీఏ నిర్ణయించింది. అయితే ఒక సరియైన సమాధానాన్ని మాత్రమే అంగీకరిస్తామని.. ఇతర సమాజాధానాలకు మార్కులు ఇవ్వలేమని మంగళవారం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.