పరీక్షల టెన్షన్: ఈ జాగ్రత్తలు పాటిస్తే కాస్త రిలీఫ్..!

పరీక్షల టెన్షన్: ఈ జాగ్రత్తలు పాటిస్తే కాస్త రిలీఫ్..!

పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే చాలు...విద్యార్ధులతోపాటు తల్లిదండ్రులు టెన్షన్ పడుతుంటారు. నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఇలాంటి పరిస్ధితులతో విద్యార్ధులు మానసికంగా ఒత్తిడికి లోనవుతారని చెబుతున్నారు సైకాలజిస్టులు. పరీక్షలు అయ్యేంత వరకూ ఇంట్లో మంచి వాతావరణం కల్పించడంతో పాటు.. కొంచెం రిలీఫ్ కోసం జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. 

పరీక్షల టైమ్ లో కొంచెం టెన్షన్ ...మరికొంత ఒత్తిడి కామన్. రెండేళ్ళ తరువాత ఇంటర్, టెన్త్ పరీక్షలు రాస్తుండటంతో విద్యార్థులతో పాటు తల్లి దండ్రుల్లోనూ టెన్షన్ కనిపిస్తోంది. 2021 అకడమిక్ ఇయర్ లో సగానికి పైగా ఆన్ లైన్ లోనే పాఠాలు విన్నారు విద్యార్థులు. ఇంకా పోర్షన్ కంప్లీట్ కాకపోవడంతో మార్చిలో జరగాల్సిన పరీక్షలు మేలో నిర్వహిస్తున్నారు. విద్యార్ధులు లెసన్స్ స్పీడ్ గా రివిజన్ చేసుకునే టైమ్ లో ఆందోళన సహజం అంటున్నారు సైకాలజిస్ట్ లు. పిల్లలు పర్ ఫెక్ట్ గా ప్రిపేర్ అయినా... సరైన టైమ్ లో గుర్తొస్తాయా... ఆన్సర్స్ బాగా రాస్తానా అని డౌట్ పడుతుంటారు. అనుకున్న మార్కులు వస్తాయా అనే సందేహాలతో ఫియర్, ఏంగ్జయిటీ, టెన్షన్ తో ఉంటారని చెబుతున్నారు. 

పరీక్షల టైమ్ లో టెన్షన్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంటున్నారు సైకాలజిస్టులు. అప్పటి వరకు చదివి రాసిన ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చినట్టే ఫైనల్లోనూ మార్కులు వస్తాయని చెప్పారు. మన శరీరం రీఛార్జ్ కావడానికి రాత్రి నిద్ర కూడా చాలా ముఖ్యమనీ...... దీంతో ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో మైండ్ ఉత్సాహంగా పనిచేస్తుందని చెబుతున్నారు. పరీక్షలకు రీడింగ్ టైమ్ తో పాటు వినోదానికీ కొంత టైమ్ కేటాయించాలంటున్నారు సైకాలిజిస్ట్ వీరేంద్ర.  పరీక్ష టైమ్ దాకా ఆడుతూ, పాడుతూ తిరిగి... పరీక్షలప్పుడు రాంత్రింబవళ్ళు కూర్చొని చదవడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని చెబుతున్నారు. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తేవొద్దని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఒక నిముషం నిబంధన అమల్లో ఉన్నందున వీలైనంత ముందే పరీక్ష కేంద్రానికి విద్యార్ధులు చేరుకోవాలి. విద్యార్ధులు కాన్ఫిడెన్స్ ని కంటిన్యూ చేస్తూ... పరీక్షలకు వెళితే మంచి రిజల్ట్ వస్తుందని చెబుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం...

ఫెడ్ న్యూయార్క్‌‌లో డైరెక్టర్‌‌‌‌గా తెలుగు వ్యక్తి

ఇండియా, ఫ్రాన్స్​ల మధ్య గట్టి బంధం