ధర్మ స్థలలో మానవ అవశేషాలు లభ్యం .. కేసులో దొరికిన తొలి ఆధారం

ధర్మ స్థలలో మానవ అవశేషాలు లభ్యం .. కేసులో దొరికిన తొలి ఆధారం

మంగళూరు: కర్నాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ‘ధర్మస్థల’లో అనుమానాస్పద మరణాల కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో100కుపైగా మృతదేహాలను పూడ్చి పెట్టానని ఒకప్పటి పారిశుధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. ఇందులో ఓ చోట గురువారం కొన్ని అవశేషాలను గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే. పారిశుధ్య కార్మికుడి ఫిర్యాదుతో ఈ అనుమానాస్పద మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌‌ ఏర్పాటు చేసింది.

 గత సోమవారం నుంచి సిట్‌‌ అధికారులు.. నేత్రావతి నదికి అవతలి వైపు ఉన్న ప్రాంతంలో మృతదేహాల అవశేషాల కోసం తవ్వుతున్నారు. మృతదేహాలను పూడ్చిపెట్టినట్టుగా మొత్తం 15 చోట్లను అతడు గుర్తించగా.. ఆ ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు.