ధర్మస్థలలో మరో చోట తవ్వకాలు

ధర్మస్థలలో మరో చోట తవ్వకాలు

ధర్మస్థల: కర్నాటకలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థలలో అత్యాచారాలు, హత్యలకు సంబంధించి స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టిగేషన్ టీమ్‌‌‌‌‌‌‌‌(సిట్‌‌‌‌‌‌‌‌) విచారణ కొనసాగుతోంది. పలువురి డెడ్‌‌‌‌‌‌‌‌బాడీలను తానే పూడ్చి పెట్టానంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ధర్మస్థలిలో కొందరు వ్యక్తులు రెండు దశాబ్దాలుగా  మహిళలు, యువతులపై అత్యాచారం చేసి, చంపేసి పూడ్చిపెట్టారని పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ ఫిర్యాదుపై దర్యాప్తులో భాగంగా పలుచోట్ల అధికారులు తవ్వకాలు జరిపి, డెడ్‌‌‌‌‌‌‌‌బాడీల అవశేషాలను స్వాధీనం చేసుకుంటున్నారు. వరుసగా ఐదో రోజూ అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. ఉజిరే ధర్మస్థల కొక్కడా హైవే 73 వెంబడి ఉన్న నేత్రావతి నది ఒడ్డున ఉన్న ప్రాంతంలో అధికారులు ఉదయం 11.30 గంటలకు చేరుకున్నారు. మొత్తం నాలుగు (9, 10, 11, 12) ప్రదేశాల్లో తవ్వకాలు జరపాలని నిర్ణయించారు. ఘటనా స్థలానికి మీడియాతో సహా ఎవ్వరినీ అనుమతించలేదు.