నైట్ కర్ఫ్యూలో మినహాయింపులు ఎవరెవరికంటే..

నైట్ కర్ఫ్యూలో మినహాయింపులు ఎవరెవరికంటే..

హైదరాబాద్: హైకోర్టు మొట్టికాయలతో తెలంగాణ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మంగళవారం రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు స్వయానా సీఎం కేసీఆర్ కరోనా బారిన పడి ఫామ్ హస్ కు పరిమితమైన వార్తలు సంచలనం సృష్టించిన నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది. నైట్ కర్ఫ్యూ కట్టుదిట్టంగా అమలు చేసే చర్యలకు శ్రీకారం చుట్టింది. కరోనా సెకండ్ వేవ్ మహమ్మారి విజృంభిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శల నేపధ్యంలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే అత్యవసర సేవలకు, అత్యవసర సర్వీసుల్లో పనిచేసే వారికి నైట్ కర్ఫ్యూలో మినహాయింపులిచ్చారు. తొలి విడుత ఆంక్షల్లో భాగంగా ఈనెల ఈనెల 30 వతేది వరకు నైట్  కర్ఫ్యూ విధించారు.
నైట్ కర్ఫ్యూలో ఇవి పనిచేస్తాయి

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా
హాస్పిటల్స్, వైద్య సేవలు, డయాగ్నస్టిక్ సెంటర్లు, మెడికల్ షాపులు
పెట్రోల్ బంకులు, సీఎన్జీ బంకులు
డెలివరీ గూడ్స్ వెహికల్స్, సెక్యూరిటీ వెహికిల్
పారిశుధ్య.. మున్సిపల్ సిబ్బంది
టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, కేబుల్, ఐటీ సేవలు

ఈకామర్స్ డెలివరీ సర్వీసులు
విద్యుత్ సరఫరా ( కరెంట్ జెన్కో, ట్రాన్స్ కో, డిస్కం సేవలు)
మంచినీటి సరఫరా
కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్ 
ప్రైవేట్ సెక్యూరిటీ సేవలు

నిరంతరం పనిచేసే ప్రొడక్షన్ యూనిట్లు, సేవలు

ఇతర రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలో జిల్లాల మధ్య అన్ని రకాల వస్తువుల రవాణా

వేరే  రాష్ట్రాలకు వెళ్లే గూడ్స్ వెహికిల్ లకు పాసులు అవసరం లేదు

నైట్ కర్ఫ్యూలో అనుమతి ఉన్నవాళ్లు 
అనుమతించిన సేవల్లో పనిచేసేవాళ్లు

కేంద్ర, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ ఉద్యోగులు

 ప్రైవేటు డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, ఇతర హాస్పిటల్ సర్వీసులవాళ్లు

గర్భిణులు, వైద్యసేవలు అవసరమైన పేషెంట్లు

ఎయిర్ పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టేషన్లకు తగిన టికెట్ తో వచ్చిపోయేవాళ్లు

అనుమతించిన సేవల్లో ఉన్నవారికోసం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, ఆటోలు, టాక్సీలు 
వీరు రాత్రి పూట ఆటోలు, ప్రైవేట్ ట్యాక్సీలు వాడుకోవచ్చు. 

కర్ఫ్యూ వర్తించేవి
సినిమా థియేటర్లు
హోటళ్లు
పబ్బులు

 క్లబ్బులు
బార్లు

మద్యం దుకాణాలు

కేంద్ర హోం శాఖ గైడ్ లైన్స్  ప్రకారం అందరూ  నియమాలు పాటించాలి.