కూరలో ఉప్పు ఎక్కువైందా ? వంటపని కష్టంగా మారిందా.. ఈ సూపర్ కిచెన్ టిప్స్ మీకోసమే..

 కూరలో ఉప్పు ఎక్కువైందా ? వంటపని కష్టంగా మారిందా.. ఈ సూపర్ కిచెన్ టిప్స్ మీకోసమే..

ఇంట్లో వంట చేసేటప్పుడు లేదా వంటగది పనులు చూసుకునేటప్పుడు కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు జరగడం చాలా సహజం.  కూరలో ఉప్పు ఎక్కువవ్వడం, గట్టిగా ఉన్న డబ్బాల మూతలు రాకపోవడం, పని ఒత్తిడి వల్ల ఒక్కోసారి వంటలు పాడయ్యే అవకాశం ఉంది. అయితే స్మార్ట్ గా ఆలోచిస్తే ఈ సమస్యలన్నింటినీ చిటికెలో పరిష్కరించవచ్చు. వంటల్లో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి ? మైక్రోవేవ్ ఒవెన్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఇలాంటి సమయంలో  కొన్ని కిచెన్ టిప్స్ పాటిస్తే చాలా ఉపయోగకరంగా  ఉంటుంది  అంటున్నారు ఎక్స్పర్ట్స్.

*వర్క్ టెన్షన్ లో  పడి కూరల్లో ఉప్పు ఎక్కువ పడితే తినలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఆలుగడ్డల్ని మీడియం సైజ్ ముక్కలుగా తరిగి ఉప్పు ఎక్కువైన వంటకంలో వేయాలి. స్టవ్ ని  సిమ్లో ఉంచి ఏడెనిమిది నిమిషాలు ఉడికించాలి. ఆలుగడ్డలు ఉప్పును పీల్చుకుంటాయి. అయితే, ఉప్పుతోపాటు కూరల్లోని వాటర్ ని కూడా ఆలుగడ్డ పీల్చేసుకుంటుంది. అందుకని ఆలుగడ్డ ముక్కల్ని వంటకంలో నుంచి తీసేశాక, అవసరమనిపిస్తే కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి.

*బయటకు వెళ్లి ఫ్రెష్ మీట్ తెచ్చుకోవాలంటే ఎక్కడ చూసినా పెద్ద క్యూలు ఉంటున్నాయి. ఏ రిస్క్ లేకుండా నాన్వెజ్ ఎంజాయ్ చేయాలంటే ఫ్రోజెన్ మీట్ వాడాలి. ఫ్రోజెన్ మీట్ తెచ్చుకుని, కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. వండుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రోజెన్ మీట్ను ఒక గిన్నెలో వేసి వేడి నీళ్లు, ఐదు టేబుల్స్ స్పున్  వెనిగర్, కొంచెం ఉప్పు వేసి పావుగంట సన్నని మంటపై ఉడికించాలి. ఇలాచేస్తే ఫ్రెష్ మీట్ వంటకు రెడీగా ఉన్నట్లే.. త్వరగా ఉడుకుతుంది. కాబట్టి, నాన్ వెజ్ వంటలు త్వరగా చేసుకోవచ్చు. వేరే ఫ్రోజెన్ ప్రొడక్ట్స్ కూడా తెచ్చి పెట్టుకున్నా  ఉపయోగమే.

*ఈజీగా వండొచ్చని ఈమధ్య పాస్తా ఎక్కువగా తింటున్నారు. అయితే పాస్తా ఉడకాలంటే ఎక్కువ టైమ్ పడుతుంది. కానీ, ఈ చిట్కా పాటిస్తే ఒకట్రెండు నిమిషాల్లోనే పాస్తా రెడీ అవుతుంది. పాస్తా క్వాంటిటీకి పదిరెట్లు నీళ్లు తీసుకుని ఉడికించాలి. వంద గ్రాముల పాస్తా తీసుకుంటే, దాదాపు 1 లీటర్ నీళ్లు పోసి ఉడికించాలి. అందులో కొద్దిగా ఉప్పు వేయాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత, పాస్తాను ఒక నిమిషం వరకు ఉడికించి తీస్తే చాలు.

*డబ్బాల మూతలు తీయడం ఒక్కోసారి చాలా టైమ్ పడుతుంది. ఈ విషయంలో ఎవరి చిట్కాలు వాళ్లకుంటాయి. అయితే, సింపుల్ గా  మరో చిట్కా ఉంది. ఒక టీ స్పూన్ ని జార్ కి మూతకు మధ్య ఉంచి తిప్పితే, మూత ఎంత టైట్గా ఉన్నాసరే ఈజీగా వస్తుంది.

*కొన్నిసార్లు బ్రెడ్ త్వరగా పాడవుతుంది. బ్రెడ్ పాడవకుండా ఉండాలంటే ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు బయటకు తీసి, మైక్రోఒవెన్లో వేడి చేసుకుంటే సరిపోతుంది.

*ఇంట్లో మైక్రోఒవెన్ ఉన్నవాళ్లు బేకరి ఐటమ్స్ ఎక్కువగా తెచ్చుకుంటారు. అవసరమైనప్పుడు వాటిని వేడి చేసుకుని తింటారు. కానీ, ఇలా వేడిచేస్తే ఐటమ్స్ డ్రై అవుతాయి. అలా కాకుండా ఉండాలంటే... వేడి చేయాలనుకున్న ఐటమ్ పాటు ఒవెన్ లో ఒక కప్పు నీళ్లు కూడా పెట్టాలి.