
హుజూర్ నగర్, వెలుగు: ఎక్సైజ్, సివిల్ పోలీసులు నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు చేశారు. ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం మంగాపురం తండా, కపూర్య తండా, లచ్యా తండా, కీతవారి గూడేల్లో ఎక్సైజ్, సివిల్ పోలీసులు దాడులు నిర్వహించి సారా తయారు చేస్తున్న ధరావత్ విజయ , వాంకుడోత్ గోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి 30 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని ,1600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. వీరి వద్ద ఉన్న టూ వీలర్ సీజ్ చేసి ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.