అమీన్పూర్, వెలుగు: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో నూతన ఎక్సైజ్ సర్కిల్స్టేషన్ను ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కలిసి సోమవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో డ్రగ్స్, హెరాయిన్, కొకైన్, గంజాయి, ఇతర మత్తు పదార్ధాలకు అడ్డాగా మారిందన్నారు.
డ్రగ్స్‌ను అరికట్టి యువత అటు వైపు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ దేవానంద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్, ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ హరికిషన్, జిల్లా ఎక్సైజ్అధికారి శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎక్సైజ్‌సూపరింటెండెంట్ మణెమ్మ, సీఐ పరమేశ్వర్‌గౌడ్, ఎస్ఐలు అనంత్‌రెడ్డి, రాములు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ
సిద్దిపేట(తొగుట): తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో పలు అభివృద్ది పనులను సోమవారం ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తుక్కాపూర్ గ్రామ అభివృద్ధికి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రత్యేక నిధులతో అభివృద్ధికి కృషి చేశానని, ఎంపీగా ఇప్పుడు తోడ్పాటునందిస్తానన్నారు. పీఎం హార్ ఘర్ సూర్య యోజన ద్వారా ప్రతీ గ్రామస్తుడు ఇంటిపై సోలార్ పానెల్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
పథకానికి కేంద్రం రూ.70 వేల వరకు సబ్సిడీ అందిస్తోందని, సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని ప్రజలకు సూచించారు. గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ తో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
