గంజాయి, లిక్కర్​ స్మగ్లింగ్​పై స్పెషల్ ​ఫోకస్

గంజాయి, లిక్కర్​ స్మగ్లింగ్​పై స్పెషల్ ​ఫోకస్

భద్రాచలం, వెలుగు : తెలంగాణ, ఏపీ, ఛత్తీస్​గఢ్ సరిహద్దుల్లో గంజాయి, లిక్కర్, నాటు సారా అక్రమ రవాణాపై స్పెషల్​ ఫోకస్​ పెట్టాలని ఆబ్కారీ శాఖ అధికారులు నిర్ణయించారు. గురువారం భద్రాచలంలో మూడు రాష్ట్రాల ఆబ్కారీ ఆఫీసర్లు ఇంటర్ స్టేట్ బార్డర్​కో–ఆర్డినేషన్​మీటింగ్​ నిర్వహించారు.

డ్రగ్స్, లిక్కర్​స్మగ్లింగ్ ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యాక్షన్ ప్లాన్ రూపొందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సహకరించాలని స్టేట్​ఆఫీసర్లు కోరారు. సరిహద్దుల్లో టెంపరరీ చెక్​పోస్టులు పెంచాలని నిర్ణయించారు.