ఏపీ నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావును విచారిస్తున్న ఎక్సైజ్ అధికారులు.

ఏపీ నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావును విచారిస్తున్న ఎక్సైజ్ అధికారులు.

ఏపీలో నకిలీ మద్యం కేసు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసుతో అధికార కూటమి నేతలకు సంబంధాలు ఉన్నట్లు వార్తలు సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబందించిన దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. శుక్రవారం ( అక్టోబర్ 10 ) నకిలీ మద్యం కేసులో A1 గా ఉన్న జనార్దన్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. శనివారం ( అక్టోబర్ 11 ) జనార్దన్ రావును రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నారు అధికారులు.జనార్ధన్ రావు అరెస్టుతో నకిలీ మద్యం కేసు కొలిక్కి వచ్చినట్లయ్యింది.

జనార్ధన్ రావు నుంచి కీలక వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు ఎక్సైజ్ అధికారులు.టీడీపీ నేత జయ చంద్రారెడ్డికి జనార్ధన్ రావుకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి... నకిలీ మద్యం ములకలచెరువు నుంచి ఇబ్రహీంపట్నం  ఎలా విస్తరించారు?, ఎక్కడెక్కడికి నకిలీ మద్యం సరఫరా చేసారు.. నకిలీ సరఫరా ఎవరి ద్వారా జరిగింది వంటి కీలక వివరాలపై జనార్దన్ రావును ప్రశ్నిస్తున్నారు అధికారులు.

శుక్రవారం అర్దరాత్రి జనార్దన్ రావును రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు.ఇవాళ జనార్ధన రావును కోర్టులో హాజరు పరచనున్నారు ఎక్సైజ్ అధికారులు.మరోవైపు బెంగుళూరు, హైదరాబాద్ మకాం వేసిన ఎక్సైజ్ బృందాలు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నాయి. మద్యం బాటిళ్లకు నకిలీ సీల్లు తయారు చేసిన బాలాజీ కోసం గాలిస్తున్నారు అధికారులు. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జనార్ధనరావుతో కలిసి ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసారు పోలీసులు.