ఈడీ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

ఈడీ నోటీసులపై  హైకోర్టును ఆశ్రయించిన  కేజ్రీవాల్

ఈడీ నోటీసులపై మరోసారి హైకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం అవరింద్ కేజ్రీవాల్. అరెస్ట్ చేయకుండా ఈడీని ఆదేశించాలని పిటిషన్ వేశారు. విచారణకు సహరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈడీ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సురేశ్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణ జరగనుంది. 

ఎక్సైజ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు 9 సార్లు సమన్లు పంపింది ఈడీ. ఇవాళ విచారణకు రావాలని ఆదేశించింది. అంతకముందు కేజ్రీవాల్ ఈడీ సమన్లంటీని ఢిల్లీలో హైకోర్టులో సవాల్ చేశారు. కేజ్రీవాల్ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు బెంచ్...వివరణ ఇవ్వాలంటూ ఈడీని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. 

మరోవైపు  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఫైరయ్యారు బీజేపీ లీడర్ హరీశ్ ఖురానా. ఈడీ సమన్లను కేజ్రీవాల్ తప్పించుకుంటున్నారని ఆరోపించారు. చట్టాన్ని, శాంతి భద్రతలను గౌరవించాలన్నారు. ఈడీ విచారణకు హాజరుకాకుండా ఎందుకు డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పించుకునే యత్నం చేస్తున్నారంటే ఏదో దాచి పెడుతున్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు హరీశ్ ఖురానా.