సంపూర్ణ సూర్యగ్రహణం: అమెరికా ప్రజల హడావుడి

సంపూర్ణ సూర్యగ్రహణం: అమెరికా ప్రజల హడావుడి

సంపూర్ణ సూర్యగ్రహణం..ఇప్పుడు దీని గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. సూర్యగ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది. ఎన్ని నిమిషాలు ఉంటుంది. దీనిని ఎలా చూడాలి.ఇలా ఎక్కడ చూసినా ఇవే చర్చలు. సోమవారం (ఏప్రిల్ 9) నాడు ఏర్పడు సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికా, కెనడా, మెక్సికో వంటి దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించనుంది. దీంతో  54 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న తొలి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చేసేందుకు అక్కడిజనం ఆ ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. సూర్యుడు, భూమిమధ్య చంద్రుడి వచ్చి సూర్యరశ్మిని అడ్డుకున్నప్పనుడు ఏర్పడు ఖగోళ అద్భుతాలను చూసేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసుకుంటున్నారు. 

ALSO READ | సుదీర్ఘ సూర్యగ్రహణం: ఆ 4 నిమిషాలే నాసాకు కీలకం

ఉత్తర అమెరికా ప్రజలు మరో 21 ఏళ్ల వరకు ఇలాంటి అద్భుతమైన ఖగోళ దృశ్యాలను చూసే అవకాశం లేనందుకు సోమవారం ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశవ్యాప్తంగా మిలియన్ల మంది అమెరికన్లు ఖగోళ ఘటనను చూసేందుకు వెళుతున్నారు. యూఎస్ లోని ఈశాన్య ప్రాంతాల్లో 15 రాష్ట్రాల్లో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 
సంపూర్ణ గ్రహణం చూసేందుకు వచ్చిన టూరిస్టులతో గ్రహణం కనిపించే ప్రాంతాల్లో రిసార్టులు కిక్కిరిపోయాయి. ఇప్పటికే దక్షిణ టెక్సా్స్ లోని ఎన్సి్స్ కుసమీపంలో రేంజ్ వింటేజ్ ట్రైలర్ రిసార్ట్ పూర్తిగా నిండిపోయింది. 
ఆదివారం బఫెలో నేవల్ అలండ్ మిలిటరీ పార్క్ లో సందడి నెలకొంది. ఉదయం నుంచే ఈ పార్కులో వాలంటీర్ టామ్ విల్లా అనేక రాష్ట్రాలనుంచి వచ్చి పర్యాటకులతో కిటకిటలాడుతోంది. 

అయితే కెనడా, ఉత్తర న్యూ ఇంగ్లాండ్ వంటి కొన్ని ప్రదేశాల్లో ఆకాశం మేఘాలతో ఉండటం వల్ల స్పష్టమైన  సూర్యగ్రహణం కనిపించే అవకాశం ఉండకపోవచ్చని అమెరిక జాతీయ వాతావరణ విభాగం  చెబుతోంది. టెక్సాస్ లో కూడా మేఘాలు కమ్ముకుని అవకాశం ఉంటుందని వాతావారణ శాఖ వెల్లడించింది.