
పూర్ణ, రవిబాబు కాంబినేషన్ అనగానే ‘అవును’ లాంటి థ్రిల్లర్ గుర్తొస్తుంది. ఈ ఇద్దరి కలయికలో ఈసారి ‘అసలు’ టైటిల్‌తో ఎక్సైటింగ్ మిస్టరీ థ్రిల్లర్ రాబోతోంది. అయితే ఈ సినిమాకు రవిబాబు దర్శకుడు కాదు. కథను అందిస్తూ నిర్మించడంతో పాటు కీలకపాత్రలో నటించాడు. ఉదయ్, సురేష్ దర్శకత్వం వహించారు. శనివారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. చక్రవర్తి అనే ప్రొఫెసర్ మర్డర్ మిస్టరీని ఛేదించే కాప్‌గా రవిబాబు కనిపించాడు. నలుగురు అనుమానితులు, నాలుగు రహస్యాలు, ఒక ఆశ్చర్యకరమైన నిజం, చివరికి హంతకుడు ఎవరు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇందులో పూర్ణ కీలకంగా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సూర్య కుమార్, భగవాన్ దాస్, సత్య కృష్ణన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా ఏప్రిల్ 13నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.