సమస్యలను పరిష్కరించకపోతే అంతర్యుద్ధం తప్పదు

సమస్యలను పరిష్కరించకపోతే అంతర్యుద్ధం తప్పదు

ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వానికి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుగా ఉంటూ వస్తున్నారు. తాలిబాన్ సర్కార్‌కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు కూడగట్టేందుకు ఆయన యత్నిస్తున్నారు. కానీ అన్ని వైపుల నుంచి పాక్ వైఖరిపై విమర్శలు వస్తుండటంతో ఇమ్రాన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. అఫ్గాన్‌లో మహిళల్ని చదువుకోకుండా చేస్తున్న తాలిబాన్లది ముమ్మాటికి తప్పేనని.. దీన్ని ఇస్లాం హర్షించదని ఆయన అన్నారు. అయితే త్వరలోనే మహిళల్ని చదువుకునేందుకు అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మానవ హక్కులను గౌరవించడాన్ని ఆ దేశ నాయకత్వం అలవర్చుకోవాలని హితవు పలికారు. 

‘తాలిబాన్ల ప్రభుత్వం అందర్నీ కలుపుకుపోతూ, అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలి. అది సాధ్యం కాకపోతే మాత్రం అఫ్గాన్‌లో అంతర్యుద్ధం రావొచ్చు. ఒకవేళ అదే జరిగితే అస్థిరత రాజ్యమేలే ప్రమాదం పొంచి ఉంది. అప్పుడు అఫ్గాన్‌ టెర్రరిస్టుల నిలయంగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకరకంగా ఇది విచారించాల్సిన అంశమే. అఫ్గాన్‌లో టెర్రరిస్టుల ప్రాభవం పెరిగితే అది పాక్ సెక్యూరిటీ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం:

వైరల్ వీడియో: చదువుకుంటూ పేపర్ వేయొద్దా..

ఎమ్మెస్సీ చదివి స్వీపర్ పని..కేటీఆర్ స్పందన

‘మా’ ఎలక్షన్స్: ప్యానెల్‌ ప్రకటించిన మంచు విష్ణు