రేప్‌‌ చేస్తే ఉరిశిక్ష -బంగ్లాదేశ్‌‌ కేబినెట్ నిర్ణయం

రేప్‌‌ చేస్తే ఉరిశిక్ష -బంగ్లాదేశ్‌‌ కేబినెట్ నిర్ణయం

ఢాకా: దేశంలో రేప్‌‌ కేసులు పెరిగిపోతున్న క్రమంలో బంగ్లాదేశ్‌‌ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రేప్‌‌ నిందితులకు ఉరిశిక్ష వేయాలనే ప్రతిపాదనకు కేబినెట్‌‌ ఆమోదం తెలిపింది. ప్రస్తుత చట్టం ప్రకా రం రేప్‌‌ బాధితురాలు చనిపోతేనే నిందితుడికి మరణశిక్ష.. మిగిలిన కేసుల్లో జీవిత ఖైదు వేస్తున్నారు. రేప్‌‌ కేసుల్లో ట్రయల్స్‌‌ను తొందరగా పూర్తిచేసే ప్రపోజల్‌‌కు ఆమోదించినట్లు కేబినెట్‌‌ స్పోక్స్‌‌పర్సన్‌‌ ఖండాకెర్ చెప్పారు. ఈ ఆర్డినెన్స్‌ను  ప్రెసిడెంట్‌ మంగళవారం జారీ చేసే అవకాశం ఉందన్నారు.