మహారాష్ట్ర, హార్యాణ రాష్ట్రాలలో ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. ఈసారి కూడా రెండు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపాయి. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి, హర్యాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరచున్నట్లు రిపోర్ట్ ఇచ్చాయి. మహారాష్ట్రలో 288 సీట్లకు గాను.. బీజేపీ కూటమికి 243, కాంగ్రెస్ కూటమికి 41 సీట్లు రానున్నట్లు తెలిపాయి. హర్యాణలో 90సీట్లకు గాను.. బీజేపీకి 75, కాంగ్రెస్ కు 10 సీట్లు, రానున్నట్లు చెప్పాయి.

