ఎగ్జిట్ పోల్స్: హిమాచల్ ప్రదేశ్లో మళ్లీ బీజేపీకే అధికారం

ఎగ్జిట్ పోల్స్: హిమాచల్ ప్రదేశ్లో మళ్లీ బీజేపీకే అధికారం

హిమాచల్ ప్రదేశ్లో మళ్లీ బీజేపీకే పట్టం కట్టే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలు వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్ లో మెజారిటీ ఓటర్లు కమలం పార్టీ వైపే మొగ్గు చూపినట్లు అంచనా వేశాయి. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ 44.8శాతం ఓట్లతో అధికారంలోకి వస్తుందని రిపబ్లిక్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ కు 42.8 శాతం ఓట్లు.. ఆమ్ ఆద్మీ పార్టీకి 2.8శాతం ఓట్లు దక్కనున్నట్లు ప్రకటించాయి.

బీజేపీకి 34 నుంచి 39 సీట్లు.. కాంగ్రెస్ కు 28 నుంచి 33 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రచారంలో అదరగొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరిచే అవకాశాలున్నాయని..  జీరో నుంచి ఒక సీటు దక్కే ఛాన్స్ ఉందని ప్రకటించాయి. 

హిమాచల్ ప్రదేశ్ లో ప్రజలు బీజీపీకే పట్టం కట్టనున్నట్లు టౌమ్స్ నౌ సర్వే  చెబుతుంది. బీజేపీకి 38 సీట్లు, కాంగ్రెస్ కు 28 సీట్లు.. ఇతరులకు రెండు సీట్లు దక్కే ఛాన్స్ ఉందని టౌమ్స్ నౌ ప్రకటించింది. 

న్యూస్ 24 టుడేస్ చాణక్య సర్వే కాంగ్రెస్, బీజేపీకి చెరో 33 సీట్లు వస్తాయని అంచనా వేసింది. న్యూస్ ఎక్స్ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే పట్టం కట్టాయి. బీజేపీకి 32 నుంచి 40 ,కాంగ్రెస్ కు 27 నుంచి 34 సీట్లు వస్తాయని తెలిపింది. జీ న్యూస్ బార్క్ సర్వే బీజేపీదే అధికారమని అంచనా వేశాయి. బీజేపీకి 35 నుంచి 40, కాంగ్రెస్ కు 20 నుంచి 25 సీట్లు వస్తాయని అంచనా వేసింది.