తాబేలు ఫోజు... కొట్టింది ప్రైజు!

V6 Velugu Posted on Sep 26, 2021

వేలకొద్ది గ్లాస్ ఫిష్ లు లొల్లివెడ్తున్నయ్. చుట్టూతా తిరుగుతూ డిస్టర్బ్ చేస్తున్నయ్. అయినా సరే.. నన్ను మంచిగ ఫొటో తీయ్ అన్నట్లుగా మస్త్ ఫోజు ఇచ్చింది ఈ సముద్ర తాబేలు. దీని ఫోజుకు జడ్జిలు కూడా ఫిదా అయిండ్రు. అందుకే.. ఈ ఫొటో తీసిన ఐమీ జాన్ అనే ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ కు ‘ఓషన్ ఫొటోగ్రాఫర్ ఆఫ్​ ద ఇయర్ 2021’ అవార్డ్ ను ప్రకటించిండ్రు. ఆస్ట్రేలియా తీరంలోని నింగలూ రీఫ్​లో ఆమె ఈ ఫొటోను తీసింది. సముద్రం అడుగున ఓ రాయి పక్కన తాబేలును చూసిన ఆమె కిందకు డైవ్ చేసింది. చేపపిల్లలన్నీ ఒక్కసారిగా పక్కకు జరిగి.. తాబేలు చుట్టూ తిరిగినయ్. ఆమె వైపు తాబేలు తదేకంగా చూసింది. ఆమె టక్కున ఫొటో తీసింది. ‘నా లైఫ్​లో ఇదే బెస్ట్ ఫొటో’ అని దానికి చెప్పి వచ్చింది.

Tagged Aimee Jan, Ocean photographer, Ocean Photography Awards

Latest Videos

Subscribe Now

More News